హ్యుండాయ్ ఐ20ఎన్ ఫొటోలు చూశారా?

హ్యుండాయ్ ఐ20ఎన్ ఫొటోలు చూశారా?

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుండాయ్ రెండు కొత్త మోడళ్ల ఫొటోలు, వీడియోలను విడుదల చేసింది. వాటిలో ఐ 20ఎన్ నమూనా ఉండటం విశేషం. ఐ20 ఎన్ ప్రొటో టైప్ ను వింటర్ టెస్టింగ్ చేస్తున్న వీడియోను రిలీజ్ చేసింది.

ఈ వీడియోను స్వీడెన్ లోని అర్జెప్లాగ్ లో షూట్ చేశారు. ఈ వీడియోలో ఐ20 డబ్ల్యూఆర్ సీ, ఆర్ ఎం19ల ఫొటోలు కూడా ఉన్నాయి. ఐ20 ఎన్ కార్ హ్యాండ్లింగ్, పునరుద్ధరించబడిన ఇంజిన్, వెహికిల్ నాయిస్ కూడా చాలా బాగుందని హ్యుండయ్ డబ్ల్యూఆర్ సీ డ్రైవర్ థైరీ న్యూవిల్లే చెప్పారు. ఈ ఏడాది మొదట్లో ఈ టెస్టింగ్ జరిగింది. వింటర్ లో ఆటోమోటివ్ టెస్టింగ్ కు పాపులర్ అయిన అర్జెపోలేలోని ఫ్రోజెన్ లేక్ లో ఈ టెస్టింగ్ జరిగింది. ఏడాది మొత్తం విపరీతమైన చలి ఉండటం ఈ ప్రాంతాన్ని వెహికిల్ టెస్టింగ్ కు అనువైనదిగా మార్చింది. ఒక్కోసారి ఇక్కడ టెంపరేచర్ మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతుంది.