I Hate Marriage Teaser : ప్రేమ వరకు ఓకే.. పెళ్లి చేసుకోవడమే కష్టం? 'ఐ హేట్ మ్యారేజ్' టీజర్‌లో అసలేం ఉందంటే?

 I Hate Marriage Teaser : ప్రేమ వరకు ఓకే.. పెళ్లి చేసుకోవడమే కష్టం? 'ఐ హేట్ మ్యారేజ్' టీజర్‌లో అసలేం ఉందంటే?

ప్రేమ, పెళ్లి, కెరీర్, ఇండిపెండెంట్ లైఫ్.. వీటి చుట్టూ నేటితరం యువత (Gen Z) ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎలాంటి ఎమోషనల్ సవాళ్లను వారు ఎదుర్కొంటున్నారు? అనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'ఐ హేట్ మ్యారేజ్' (I Hate Marriage). సుగి విజయ్, జుప్సీ భద్ర, హారిక రాజేందర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంతో పరమేశ్‌ రేణుకుంట్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతూ..యూత్‌లో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఆర్య సినిమా బ్యానర్‌పై మాదం దయానంద్, కార్తిక్ వెంపటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెళ్లి విషయంలో యువతకు ఉండే సందేహాలు, సంబంధాలపై వారి అభిప్రాయాలు, జీవితంలో తీసుకునే నిర్ణయాలు సినిమాలో కీలకంగా ఉండనున్నాయని ఈ టీజర్ తెలియజేస్తోంది.

నేటి జెన్ జీ యూత్ మైండ్‌సెట్‌ను, వారి ఫ్రీడమ్ ఆలోచనలను చాలా నాచురల్‌గా, రియాలిటీకి దగ్గరగా చూపించామని చెప్పారు దర్శకుడు పరమేశ్‌ రేణుకుంట్ల . థియేటర్లలో ప్రతి ఒక్కరూ తమని తాము స్క్రీన్ మీద చూసుకున్న ఫీలింగ్ పొందుతారు. కంటెంట్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్స్, మంచి మెసేజ్ కూడా ఈ చిత్రంలో ఉంటాయని చెప్పారు. ఇక యూత్ అందరూ పక్కాగా రిలేట్ చేసుకునే కాన్సెప్ట్ ఇదని, త్వరలోనే గ్రాండ్‌గా థియేట్రికల్ లీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.

సీనియర్ నటుడు పృథ్వీరాజ్, రవివర్మ అడ్డూరి, ఆశ్రిత వేముగంటి వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ సి. కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా, వరికుప్పల యాదగిరి అద్భుతమైన పాటలు, ప్రవీణ్ ఇమ్మడి సాలిడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. యూత్‌ని థియేటర్లకు రప్పించే సరైన మసాలా అంశాలతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి..