హే బలవంత్పై నమ్మకంగా ఉన్నాం: సుహాస్

హే బలవంత్పై నమ్మకంగా ఉన్నాం: సుహాస్

సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హే బలవంత్’.  గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈనెల 20న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ ‘ఇదొక కంప్లీట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్.

చిన్నప్పటి నుంచి బిజినెస్‌‌‌‌ చేయాలని ఆలోచించే కొడుకు,  నాన్న బిజినెస్‌‌‌‌ను టేకప్‌‌‌‌ చేయాలనుకుంటాడు. అప్పుడు అతనికి ఎలాంటి  పరిణామాలు ఎదురయ్యాయి, అసలు ఆ బిజినెస్ ఏంటనేది  ఫన్నీగా ఉంటుంది. ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌తోపాటు ఇందులోని ఎమోషన్‌‌‌‌కు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు.

హీరోయిన్ శివానీ నాగారం పాత్ర కూడా వినోదాత్మకంగా ఉంటుంది. నా ఫాదర్ పాత్రను నరేష్ పోషించారు. మా మధ్య వచ్చే సన్నివేశాలు  ప్రేక్షకులను ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తాయి. ఈ కథను   దర్శకుడు గోపీ చాలా బాగా డీల్ చేశాడు.   మేం అనుకున్న దానికంటే వందరెట్లు బెటర్‌‌‌‌‌‌‌‌ అవుట్‌‌‌‌పుట్ వచ్చింది. 

ఈ సినిమాపై టీమ్ అందరం నమ్మకంగా ఉన్నాం. వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఇక  సెన్సారు వారి సూచనతో ‘హే భగవాన్’ను ‘హే బలవంత్‌‌‌‌’గా  మార్చాం.  ప్రస్తుతం తమిళంలో ‘మందాడి’ చిత్రంలో విలన్‌‌‌‌గా నటిస్తున్నా. అలాగే  కార్తీక్‌‌‌‌ సుబ్బరాజు బ్యానర్‌‌‌‌లో ఓ సినిమా చేస్తున్నా.  కొన్ని తెలుగు  కథలు వింటున్నా’ అని చెప్పాడు.