ఈ కట్టే కాలేవరకు చిరంజీవి అభిమానినే : అల్లు అర్జున్

ఈ కట్టే కాలేవరకు చిరంజీవి అభిమానినే : అల్లు అర్జున్

బేబీ(Baby) సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు రూ.50 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను షాక్ కు గురిచేసింది. చాలా రోజుల తరువాత వచ్చిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ కావడంతో యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు ఈ సినిమాకు. వర్షాలను కూడా లెక్కచేయకుండా బేబీ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు.  

ఇక ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో తాజాగా అప్రిసియేషన్ మీట్ ఏర్పాటు చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Iconstar allu arjun). ఈ సందర్బంగా ఆయన.. బేబీ మూవీ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. బేబీ గురించి మాట్లాడిన అల్లు అర్జున్.. సినిమా తనకు బాగా నచ్చిందని, ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా.. మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 

బేబీ సినిమా నిర్మాత SKN గురించి మాట్లాడుతూ.. నేను, SKN ఇద్దరం చిరంజీవి అభిమానులమే. ఈ కట్టే కాలేవరకు మేము ఆయన అభిమానులుగానే ఉంటాం అందులో ఎలాంటి మార్పు ఉండదు. చిరంజీవి సినిమా సైట్స్ లో నేను డాన్స్ చేసేవాణ్ణి. పక్కనే ఉన్న చిన్న రూమ్ లో SKN ఉండేవారు. అలాంటి SKN తరువాత,  జర్నలిస్టుగా, పీఆర్‌వోగా, నిర్మాతగా మారి సూపర్ సక్సెస్‌ అయ్యాడు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.