హృదయాలను కరిగించేశావు తల్లీ.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్

హృదయాలను కరిగించేశావు తల్లీ.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna). కొత్త దర్శకుడు శౌర్యువ్(Shouryuv) తెరకెక్కించిన ఈ ఫాథర్ అండ్ డాటర్ ఎమోషనల్ కంటెంట్ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ సాధించింది. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా నటించిన ఈ  సినిమాలో బేబీ కియార(Baby Kiara) కీ రోల్ లో కనిపించి మెప్పించింది. అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి.

తాజాగా హాయ్ నాన్న సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇటీవల హాయ్ నాన్న సినిమా చూసిన ఆయన సినిమా గురించి చెప్తూ.. హాయ్ నాన్న మేకర్స్ కు అభినందనలు. సినిమా చాలా బాగుంది. హృదయానికి హత్తుకునెలా ఉంది. నా సోదరుడు నాని అద్భుతంగా నటించారు. ఇంత మంచి సినిమాను అందించినందుకు మేకర్స్ పట్ల గౌరవం కలుగుతోంది. డియర్ మృణాల్.. తెరపై నీ నటన మనసులను వెంటాడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నా డార్లింగ్.. బేబీ కియారా.. నీ ముద్దు ముద్దు మాటలతో మా హృదయాలు కరిగించేశావు తల్లీ. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ కు నా అభినందనలు. దర్శకుడు శౌర్యువ్.. కంగ్రాచ్యులేషన్స్. మీ తొలి చిత్రంతోనే కంటతడి పెట్టించారు. ఇలాగే  మరిన్ని గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇక ప్రేక్షకులకు హాయ్ నాన్న లాంటి గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాతలకు అభినందనలు. అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.