Allu Arjun : జపాన్ సీఈఓకు అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్.. అట్లీ మూవీతో బన్నీ నెక్స్ట్ లెవల్ ప్లాన్!

Allu Arjun : జపాన్ సీఈఓకు అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్.. అట్లీ మూవీతో బన్నీ నెక్స్ట్ లెవల్ ప్లాన్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తనదైన 'స్టైల్' చూపిస్తున్నారు. 'పుష్ప' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బన్నీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈరోజు ( మార్చి 27, 2026 )  శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భారతీయ సంస్కృతిని విదేశీయులకు పరిచయం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

 సీఈఓతో ఆధ్యాత్మిక చర్చలు

శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా అల్లు అర్జున్ జపాన్‌కు చెందిన ప్రముఖ 'గీక్ పిక్చర్స్' (Geek Pictures) సీఈఓ టోమట్సు కోసానోను ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీరాముడి విశిష్టతను, భారతీయ సంప్రదాయంలో సీతారాముల ప్రాముఖ్యతను ఆయనకు వివరించారు. అంతేకాకుండా, అత్యంత భక్తిశ్రద్ధలతో 'సీతారామ కళ్యాణం' చిత్రపటాన్ని కోసానోకు బహుకరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఒక గ్లోబల్ స్టార్‌గా ఉంటూనే మన మూలాలను మర్చిపోకుండా ప్రచారం చేయడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అట్లీతో భారీ 'పాన్ వరల్డ్' సినిమా!

అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో పట్టాలెక్కిస్తున్నారు. ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాకుండా, ఈ సినిమాలో అగ్ర తారల సందడి భారీగా ఉండబోతోంది. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా , భాగ్యశ్రీ బోర్సే వంటి క్రేజీ హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇది నిజమైతే, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక అతిపెద్ద మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌గా నిలవడం ఖాయం అంటున్నారు.

ఏప్రిల్ 8న టీజర్ ట్రీట్?

అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు దగ్గరపడుతోంది. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ లేదా టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అట్లీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు..