మా నాన్న నాకు రెమ్యునరేష‌న్ ఇవ్వ‌లేదంటూ..అల్లు పోస్ట్ వైరల్

మా నాన్న నాకు రెమ్యునరేష‌న్ ఇవ్వ‌లేదంటూ..అల్లు  పోస్ట్ వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (AlluArjun) సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నారు. తన సినీ ప్రయాణానికి అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ బన్నీ ఎంట్రీకి తోడయ్యాయి అంతే. ఇక తన యాక్టింగ్ పరంగా, డ్యాన్స్ పరంగా తన కష్టాన్ని, తన ప్యాషన్ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. కనుకే 70 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్స్ కూడా క్రియేట్ చేశారు. 

ఇదిలా ఉంచితే..బన్నీ తన ఇంస్టాగ్రామ్లో స్టేటస్లో పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చాలా ఆసక్తికరంగా ఉండటం విశేషం..అందులో ఉన్న ఇంట్రెస్టింగ్ కామెంట్ అల్లు ఫ్యాన్స్కి తెగ నచ్చుతోంది.

'నా ఫస్ట్ మూవీ విజేత..ఆ మూవీకి ప్రొడ్యూసర్ మా నాన్న..కానీ,మా నాన్న నాకు రెమ్యునరేషన్‌ ఇవ్వలేదు' అని బ‌న్నీ ఇన్స్టా పోస్ట్‌లో ఫొటోతో పాటు..స్మైలీ ఎమోజీ జోడించారు. ఆయన షేర్‌ చేసిన ఫొటోలో..చిరంజీవి 'విజేత' 100 రోజుల జ్ఞాపికతోపాటు అల్లు అరవింద్‌ (Allu Arvind) నవ్వుతూ కనిపించారు.

ఈ విజేత మూవీలో బన్నీ నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి గాను చిరంజీవికి  ఉత్తమ తెలుగు నటుడుగా రెండోసారి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఒకప్పటీ స్టార్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ విజేత మూవీని అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించారు. 

అంతేకాకుండా బన్నీపెద్దాయ్యాక చిరు, సిమ్రాన్ న‌టించిన 'డాడీ' సినిమాలో స్పెషల్ సాంగ్తో పాటు కొన్ని సీన్స్లో నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఆ త‌ర్వాత 'గంగోత్రి' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి..పుష్ప మూవీతో బన్నీ రేంజ్ పాన్ ఇండియాకి చేరింది. ఇక నెక్స్ట్ రాబోయే పుష్ప 2 మూవీతో పాన్ వ‌ర‌ల్డ్ కి వెళ్లాలని బన్నీ ప్లాన్ చేస్తున్నాడు.