ప్రియదర్శి లీడ్ రోల్‌లో తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రూపొందుతున్న వినోదాత్మక చిత్రం ‘ఇడుపుకాయితం’ (Idupu Kayitham). ఫోక్ సాంగ్స్‌తో గుర్తింపును అందుకున్న నాగదుర్గ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్, బన్నీ వాస్ కలిసి నిర్మిస్తున్నారు.
మంగళవారం (Aug25) హీరో ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ఫస్ట్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ‘‘ఓ శ్రీలత శ్రీలత శ్రీలత నువ్వు సిన్నబోకే నా శ్రీలత... శ్రీలత శ్రీలత శ్రీలత ఈ శ్రీనివాసుడే నీ జత”అంటూ సాగిన మెలోడియస్ సాంగ్‌ను సురేష్ బొబ్బిలి కంపోజ్ చేశారు.
The fragrance of our roots. The story of every home 🏠
— Bunny Vas (@TheBunnyVas) June 25, 2026
We begin with Love & Blessings ✨
A Memorable Collaboration with @SukumarWritings 1st production, #IdupuKayitham ❤️📃@aryasukku @Thabithasukumar @BunnyVasWorks @Preyadarshe #NagaDurga #VamsiReddyDondapati @sureshbobbili9… pic.twitter.com/IL6WLeyXPG
కొత్తగా పెళ్లయిన జంట మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్‌గా చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంది. త్వరలో ఫుల్ వెర్షన్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. శివజ్యోతి, సుజాత, చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
