అక్బరుద్దీన్ ని అరెస్ట్ చేయాలి. లేకపోతే..

అక్బరుద్దీన్ ని అరెస్ట్ చేయాలి. లేకపోతే..

హైదరాబాద్: కరీంనగర్ ముస్లిం ఆత్మీయ సభలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విశ్వహిందూ పరిషత్ ( VHP ) రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వి హెచ్ పీ అధ్యక్షుడు రామరాజు అధ్యక్షతన భాగ్యనగర్ లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యల పై VHP మండిపడింది.

అక్బరుద్దీన్ వ్యాఖ్యలు యావత్తు భారతదేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని రామరాజు అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ని తక్షణం అరెస్ట్ చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని ఆయన అన్నారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎం ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, అందుకనే టీఆర్ఎస్ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ఖండిచలేదని రామరాజు అన్నారు. జులై 29న తెలంగాణలోని అన్ని జిల్లాలలో మిత్రపక్షాల మిత్రులైన కేసీఆర్, అక్బరుద్దీన్ ల దిష్టిబొమ్మలను దహనం చేస్తామని ఆయన తెలిపారు. జులై 31న హైదరాబాద్ లో నిరసనలు, దిష్టిబొమ్మల దహనం జరుగుతుందని అన్నారు.  అప్పటికీ అక్బరుద్దీన్ అరెస్ట్ చేయకపోతే.. ఆగస్ట్ 7న డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు రామరాజు.