Vastu Tips: రెండు వాకిళ్లు ఉంటే ఎటు నుంచి నడవాలి.. ఉత్తర ఈశాన్యంలో వీధిపోటు లాభమేనా..?

Vastu Tips:  రెండు వాకిళ్లు ఉంటే ఎటు నుంచి నడవాలి.. ఉత్తర ఈశాన్యంలో వీధిపోటు లాభమేనా..?

ఇంటిని నిర్మించుకోవడం ప్రత ఒక్కరికి కల.. చిన్నదైనా.. లేదా అపార్ట్​ మెంట్​ లో ఏదైనా ప్లాట్​ అయినా తీసుకోవాలనుకుంటారు.  ఇల్లు కొనేటప్పుడు  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..  ఇంటికి రెండువైపులా వాకిళ్లు ఉంటే ఎటునుంచి నడవాలి..  వీధిపోటు ఉంటే మంచిదేనా..   మొదలగు విషయాలపై వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్( 94400 88799​ ) చెబుతున్న సూచనలు, సలహాలను ఒకసారి పరిశీలిద్దాం. .  .

 ప్రశ్న : మా ఇంటికి రెండు వాకిళ్లున్నాయి. ఒకటి పడమర వైపు. రెండోది దక్షిణం వైపు. కానీ పడమర వైపు ద్వారంలోంచి ఇంటి యజమాని నడిస్తే, ఆయుష్షు తగ్గుతుందని ఓ సిద్ధాంతి చెప్పాడు. నిజమేనా? వాస్తు ప్రకారం ఎటువైపు నడవాలి?

జవాబు: మీరు ఇల్లు కొనేటప్పుడు లేదా కట్టించుకునేటప్పుడు వాస్తు తప్పనిసరిగా చూసుకోవాలని అంటున్నారు వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​. పడమరలో కూడా రెండు రకాలుగా ద్వారాలు ఉంటాయి.ఇంటి యజమాని నైరుతి నుంచి బయటకు వెళ్లడం మంచిది కాదు. పడమర వాయువ్యం నుంచి వెళ్తే మంచిది. అలాగే దక్షిణ నైరుతిలో దారి ఉంటే క్లోజ్ చెయ్యండి. ఈ ఇంట్లో ఉండగానే మీరు వేరే ఆస్తులు కొనే యోగం ఉంది. అలా కొనలేదు అంటే.. తప్పకుండా మీ ఇంటి నిర్మాణంలో మార్పులు చేయించుకోండి.

వీధిపోటు విషయంలో....

ప్రశ్న: మా ఇంటికి ఉత్తరం వైపున్న దారి వల్ల వీధిపోటు తగులుతుందని చెప్తున్నారు. తూర్పు, ఉత్తరం దిక్కుల్లో రోడ్లు ఉన్నాయి. ఈశాన్యం, ఆగ్నేయంలో కొంతస్థలం వదిలేసి పడమర వైపు ఇల్లు కట్టుకున్నాం. వీధిపోటు తప్పించుకోవాలంటే ఏం చేయాలి?

జవాబు: అన్ని రకాల వీధిపోట్ల వల్ల చెడు జరగదు. కొన్ని వీధిపోట్లు మంచివి కూడా. వీధిపోటు ఉత్తర ఈశాన్యంలో ఉంటే మేలు జరుగుతుంది. ఉత్తర వాయువ్యంలో ఉండకూడదు. మీ ఇంటికి ఉత్తర వాయువ్యంలో వీధిపోటు ఉంటే స్థలాన్ని డివైడ్ చేసి, గోడ కట్టుకుంటే వీధిపోటు సమస్య రాదు. ఆ స్థలాన్ని అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. మీ దగ్గర్లో ఉన్న సిద్ధాంతికి స్థలాన్ని చూపించండి