ప్రొజెక్టర్..​ అచ్చం టీవీలానే 

ప్రొజెక్టర్..​ అచ్చం టీవీలానే 

స్మార్ట్ టీవీలు వచ్చాక పెద్ద స్క్రీన్ మీద సినిమాలు చూసే అవకాశం దొరికింది. అయితే, ఈ  అవొల్​ ఎల్​టివి–3500 అల్ట్రా షార్ట్ ప్రొజెక్టర్ ఉంటే స్మార్ట్ టీవీ అవసరమే లేదు. ఇందులో డాల్బీ అట్మస్ సౌండ్​ని ఎంజాయ్ చేస్తూ, నెట్​ఫ్లిక్స్, అమెజాన్​ యాప్​లో నచ్చిన సినిమా చూడొచ్చు. ఈ ప్రొజెక్టర్  3,500 ల్యూమెన్​ కాంతిని వెదజల్లుతుంది. దీని వెనకాల హెచ్​డిఎంఐ జాక్, యూఎస్​బి ఉంటాయి. ఇందులో ఎఎల్​ఆర్ (ఆంబియెంట్ లైట్ రిజెక్టింగ్ స్క్రీన్) ఉంటుంది. ఈ ప్రొజెక్టర్ 12 కిలోల బరువు ఉంటుంది. 3800x2160@60 హెడ్జ్ డాల్బీ ఆట్మస్, హెడిఆర్ (హై డైనమిక్ రేంజ్)10 ప్లస్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్​ ఉంటుంది. దీంతో పాటు ఫైర్ టీవీ స్టిక్ 4కె మ్యాక్స్​ ఉంటాయి. 36 వాట్​ స్టీరియో స్పీకర్లు ఉంటాయి. గేమింగ్ కోసం 30ఎంఎస్ లాగ్ ఉంటుంది. కళ్లు దెబ్బతినకుండా ఈ ప్రొజెక్టర్​లోని మోషన్ డిటెక్టెడ్ ఫీచర్​ లేజర్​ లైట్​ని డిజేబుల్ చేస్తుంది. ఈ ప్రొజెక్టర్ ధర మూడు లక్షల రూపాయల పైనే.