IIT Hyderabad Jobs: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీహెచ్) అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: అకౌంటెంట్.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి కామర్స్ విభాగంలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. టాలీ, ఈఆర్పీ వంటి అకౌంటింగ్ సాఫ్ట్వేర్లు, ఎంఎస్ ఆఫీస్ ముఖ్యంగా ఎక్సెల్ వాడకంలో నైపుణ్యంతో పాటు ఆర్థిక నివేదికల రూపకల్పనపై పట్టు ఉండాలి. ప్రభుత్వ సంస్థలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు లేదా ప్రఖ్యాత ప్రైవేట్ సంస్థల్లో అకౌంటింగ్, ఆర్థిక నిర్వహణ, బడ్జెట్ పర్యవేక్షణ, యుటిలైజేషన్ సర్టిఫికెట్ల రూపకల్పనలో కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరి. జీఎస్టీ, టీడీఎస్, ఆదాయపు పన్ను నిబంధనలు, చట్టబద్ధమైన నిబంధనల పరిపాలనతో పాటు ఫైనాన్షియల్ ఆడిట్ ప్రక్రియలపై సమగ్ర అవగాహన ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 45 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 2.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 22.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.iith.ac.inను సందర్శించండి.
