బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్, వర్సటైల్ యాక్టర్ అక్షయ్ ఖన్నా.. ఈ ఇద్దరు పవర్‌హౌస్ పర్‌ఫార్మర్స్ ఒకే స్క్రీన్‌పై తలపడితే ఎలా ఉంటుంది? ఆ ఊహే నెక్స్ట్ లెవెల్ కదా! సరిగ్గా ఇలాంటి ఒక సాలిడ్ కోర్ట్‌రూమ్ బ్యాటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది బాలీవుడ్ క్రేజీ మూవీ 'ఇక్కా' (Ikka). నెట్‌ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ కాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం యొక్క అఫీషియల్ ట్రైలర్‌ను మంగళవారం ( జూన్ 30, 2026 ) మేకర్స్ విడుదల చేశారు. 'ది బిగ్గెస్ట్ కేస్ నీడ్స్ ది బిగ్గెస్ట్ ప్లేయర్' అనే అదిరిపోయే క్యాప్షన్‌తో వచ్చిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
అసలు కథేంటంటే..?
ట్రైలర్ చూస్తుంటే ఇదొక హై-వోల్టేజ్ లీగల్ వార్ అని క్లియర్ గా అర్థమవుతోంది. ఇందులో సన్నీ డియోల్ ఎవ్వరికీ లొంగని, అపజయం ఎరుగని టాప్ లాయర్ 'అర్జున్ మెహ్రా' పాత్రలో కనిపిస్తుండగా.. అక్షయ్ ఖన్నా ఒక మర్డర్ అటెంప్ట్ కేసులో నిందితుడిగా ఉన్న 'శౌర్యమాన్ గౌర్' అనే మిస్టరీ మ్యాన్ పాత్రలో నటిస్తున్నారు. మనం కోర్టులో గెలవడానికి కాదు.. హక్కు కోసం పోరాడతాం అంటూ సన్నీ డియోల్ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. తన గత జీవితంతో ముడిపడి ఉన్న అక్షయ్ ఖన్నా కేసును అర్జున్ మెహ్రా ఎలా డీల్ చేశాడు? వృత్తి ధర్మం, కుటుంబ బంధాలు, పాత పగలు మధ్య నలిగిపోయే ఒక లాయర్ కథే ఈ 'ఇక్కా'.
ALSO READ : అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక'..
ట్విస్టులు మీద ట్విస్టులు..
ఒకవైపు అక్షయ్ ఖన్నా తనను కాపాడమంటూ సన్నీ డియోల్‌తో మైండ్ గేమ్స్ ఆడుతుంటే.. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధుర బెనర్జీ పాత్రలో తిలోత్తమ షోమే న్యాయం కోసం వేసే ప్లాన్లు ట్రైలర్‌లో డ్రామాను పీక్స్‌కి తీసుకెళ్లాయి. అలాగే గ్లామరస్ బ్యూటీ దియా మీర్జా, సంజీదా షేక్, శిశిర్ శర్మ, ఆకాంక్ష రంజన్ కపూర్ వంటి క్రేజీ కాస్టింగ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వంలో, అల్కెమీ ఫిల్మ్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మైండ్ గేమింగ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. జులై 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ మైండ్ గేమ్ లో 'ఇక్కా' కింగ్ ఎవరు అవుతారో చూడాలి.
