జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో లైసెన్స్ లేకుండా అక్రమంగా నిల్వ చేసిన మెడిసిన్ స్వాధీనం చేసుకోవడంతోపాటు అర్హత లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్‌లో పన్నీరు రమేశ్‌కు ఎలాంటి అర్హతలు లేకపోయినా ఫస్ట్ ఎయిడ్ క్లినిక్, లైసెన్స్ లేకుండా మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు.
సమాచారం అందుకున్న జిల్లా డ్రగ్ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, భూపాలపల్లి జిల్లా డ్రగ్ఇన్స్పెక్టర్ పావని దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 2.10 లక్షల విలువైన యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్, బీపీ, యాంటీ అల్సర్ మందులు, దగ్గు సిరప్లు, నొప్పి నివారణ వంటి 40 రకాల టాబ్లెట్లు, సిరప్‌లను సీజ్ చేశారు. రమేశ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
