సోషల్ మీడియా సెన్సేషన్‌గా కెరీర్ ప్రారంభించి, నేరుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు జంటగా నటిస్తున్న ఇమాన్వి.. తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’లో నటిస్తున్న ఆమె.. ఈ సినిమా రిలీజ్‌కు ముందే పవన్ కళ్యాణ్‌కు జంటగా నటించే అవకాశం అందుకోనుండటం విశేషం. పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్ పాత్రకు కొత్తగా, ట్రెండీగా ఉండే హీరోయిన్ కావాలని భావించిన దర్శకుడు సురేందర్ రెడ్డి.. ఇమాన్వి పేరును ప్రతిపాదించగా పవన్ కళ్యాణ్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఉగాదికి సినిమాను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ‘ఫౌజీ’లో క్లాసిక్ లుక్‌లో కనిపించనున్న ఇమాన్వి.. పవన్ సినిమాలో మాత్రం మోడ్రన్ అండ్ స్టైలిష్ క్యారెక్టర్లో కనువిందు చేయనుందనే టాక్ వినిపిస్తోంది.
