ఫ్యామిలీ డే ఒకటుందని తెలుసా...? ఈరోజైనా ఫ్యామిలీతో హ్యాపీగా గడపండి బాస్..!

ఫ్యామిలీ డే ఒకటుందని తెలుసా...? ఈరోజైనా ఫ్యామిలీతో హ్యాపీగా గడపండి బాస్..!

సెలవుల సమయాల్లో ఎక్కడెక్కడో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక్కదగ్గరికి చేరితే... మరికొందరు మాత్రం తమవాళ్లను కలవలేక, ఒంటరిగా ఉండలేక నరకం అనుభవిస్తున్న పరిస్థితి. ఇటువంటి సిచ్యుయేషన్లో వచ్చింది 'ఫ్యామిలీ డే' ఏటా ప్రపంచవ్యాప్తంగా మే 15వ తేదీన వరల్డ్ ఫ్యామిలీ డేగా జరుపుకొంటున్నారు. అందరూ ఒకే చోట ఉన్న ఫ్యామిలీకి ఇది హ్యాపీ ఫ్యామిలీ డే అయితే.. మిగతా వాళ్ళు మాత్రం ఒంటరిగా గడపాల్సిన పరిస్థితి.

అంతా ఒకేచోట ఉంటే..

ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకేచోట ఉంటే.. ఈ రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోండి. సెలవు రోజున కూడా ఫోన్లో రీల్స్ చూస్తూ గడపకుండా ఫ్యామిలీతో ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్లి ఫ్యామిలీ డే రోజు సరదాగా గడపండి 

ఫ్యామిలీకి దూరంగా ఉన్నారా?

దూరంగా ఉంటే బంధం మరింత బలపడుతుందంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీ రిలేషన్ మరింత స్ట్రాంగ్ గా మారడానికి ఈ దూరాన్ని దగ్గరగా మార్చుకోండి. అయినా సెల్ఫోన్లు, వాట్సాప్లు, వీడియో కాల్స్ వచ్చిన తర్వాత.. దూరంగా ఉంటున్నామనే బాధ నుంచి కొంత రిలీఫ్ దొరుకుతోంది. ఓ గ్రూప్ కాల్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీ మొబైల్ స్క్రీన్పైకి తెచ్చుకోవచ్చు. వాళ్లందరితో హ్యాపీగా మాట్లాడుతూ..మీరు కూడా హ్యాపీగానే ఉన్నాననే విషయాన్ని వాళ్లకు చెప్పొచ్చు. వాళ్లందరినీ హ్యాపీగా ఉంచొచ్చు.

కాన్సెప్ట్ ఎందుకంటే..

న్యూక్లియర్ ఫ్యామిలీ కల్చర్ వచ్చాక బతుకుదెరువు కోసం పట్టణాలకు, దేశవిదేశాలకు వెళ్లిపోతున్నవాళ్లను కనీసం ఏడాదికోసారైనా ఒకదగ్గరకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ ఫ్యామిలీ డే కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు. 

అయితే మిగతా రోజుల్లాగే ఈ రోజును కూడా విషెస్ కే పరిమితం చేస్తూ.. ఎవరి పనుల్లో వాళ్లుంటున్నారు. ఫ్యామిలీ విలువ తెలియాలంటే ఫ్యామిలీ డే రోజైనా కుటుంబంతో గడపండి.