లక్షల్లో ఒకరికి జరిగే ఘటన.. ఒడిశాలో ఒకే శరీరం.. రెండు తలల శిశువు జననం

 లక్షల్లో ఒకరికి జరిగే ఘటన.. ఒడిశాలో  ఒకే శరీరం.. రెండు తలల శిశువు జననం

లక్షల్లో ఒకరికి జరిగే సంఘటన ఇది. ఒడిశాలో ఒకే శరీరం.. రెండు తలలతో బాలుడు జన్మించడం వైరల్ గా మారింది. ఈ వింత ఘటనకు సంబంధించిన వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో  వెలుగులోకి వచ్చిన ఈ అరుదైన మెడికల్ కేసు గురించిన వివరాలు ఇలా ఉన్నాయి.   ఒక మహిళ రెండు తలలతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. 2026 అక్టోబర్  10న సి-సెక్షన్ ద్వారా జన్మించిన  శిశువుకు రెండు తలలు ఉండటం చూసి డాక్టర్లు షాకయ్యారు.  వెంటనే బెర్హంపూర్‌లోని ఎంకేసిజి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (SNCU)లో చేర్పించారు. 

ఈ అరుదైన ఘటన అందరి దృష్టినీ ఆకర్షించింది. రెండు తలలతో పుట్టిన శిశువు ఆరోగ్య పరిస్థితి ఏంటి..? మున్ముంది ఎలా ఉంటుంది..? ప్రస్తుం కండిషన్ ఏంటనే టెన్షన్ అందరిలో మొదలైంది. 

ఒకే శరీరానికి రెండు తలలు, మెడలు అతుక్కుని ఉండే ఈ అరుదైన  వచ్చే పరిస్థితిని వైద్యపరంగా డైసెఫాలిస్ పారాపగస్ అంటారు. తల్లి ఒడిషా కంధమాల్‌లోని తుముడిబంధ్ ప్రాంతానికి చెందిన నివాసి అని, తండ్రి రోజువారీ కూలీగా పనిచేస్తున్నారని భావిస్తున్నారు. ప్రత్యేక వైద్య సంరక్షణ కోసం తల్లిని ఆసుపత్రికి తరలించారు. 32 వారాల గర్భధారణ సమయంలో శిశువు జన్మించగా ఇది ఆ దంపతులకు మొదటి సంతానం అన చెబుతున్నారు. 

 అయితే బాబుకు రెండు తలలు ఉన్నప్పటికీ ఒక మనిషికి ఉన్నట్లుగా ఒకటే మొండెం.. రెండు చేతులు, రెండు కాళ్లు ఉండటం గమనార్హం. వీటితో పాటు మల మూత్ర విసర్జనకు సంబంధించి జననేంద్రియ అవయవాలు కూడా ఒక మనిషికి ఉన్నట్లుగా ఒక్కొక్కటే ఉన్నట్లు చెబుతున్నారు.   అయితే హెల్త్ కండిషన్ ఏంటనేది ఇంకా స్పష్టత రాలేదు. డాక్టర్లు చెప్పలేదు. 

వైద్యులు శిశువు పరిస్థితిని అంచనా వేసి, తగిన చికిత్సా విధానాన్ని నిర్ణయించడంపై దృష్టి సారించారు. ఆ శిశువు ఆసుపత్రిలోని SNCUలో వైద్య పర్యవేక్షణలో ఉంది.

 కలిసి పుట్టిన అవిభక్త కవలలు అత్యంత అరుదు, ప్రతి 3లక్షలలో  కేవలం ఒకరికి  జన్మిస్తారు. ఈ కేసు ప్రజల దృష్టిని గణనీయంగా ఆకర్షించడంతో పాటు, అరుదైన పుట్టుకతో వచ్చే వ్యాధులకు చికిత్స చేసేటప్పుడు వైద్యులు ఎదుర్కొనే సవాళ్లను కూడా ఇది వెలుగులోకి తెచ్చింది.