హైలైట్‌‌గా.. విశ్వంభర ఇంటర్వెల్ ఫైట్

హైలైట్‌‌గా.. విశ్వంభర ఇంటర్వెల్ ఫైట్

చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. త్రిష హీరోయిన్. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. సోమవారంతో ఓ భారీ స్టంట్ సీక్వెన్స్‌‌ను పూర్తి చేశారు. ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్  ప్రకాష్ నిర్మించిన 54 అడుగుల హనుమాన్ విగ్రహంతో కూడిన హ్యుజ్ సెట్‌‌లో ఈ సీన్స్‌‌ను చిత్రీకరించారు. 26 రోజుల పాటు జరిగిన ఈ యాక్షన్ సీక్వెన్స్‌‌ను రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేశారు. చిరంజీవి, ఫైటర్స్ మధ్య   ఇంటర్వెల్ బ్లాక్‌‌లో వచ్చే ఈ ఫైట్ సీన్ సినిమాకు హైలైట్‌‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.   

ఈ హైవోల్టేజ్ యూనిక్ యాక్షన్ బ్లాక్ అభిమానులను  థియేటర్‌‌లలో మెస్మరైజ్ చేయనుందని చెప్పారు.  ఇందులో చిరంజీవి డ్యుయెల్ రోల్ చేస్తున్నారని, అందులో ఒకటి యంగ్‌‌ లుక్‌‌ కాగా, వయసు పైబడిన మరో పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. సురభి, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, ప్రవీణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి10న విడుదల కానుంది.

Vishwambhara,Chiranjeevi,Trisha,Directed by Vashishta,socio fantasy movie,being shot at a fast pace,highlight,interval fight,telugumovies news,telugunews,latestnewstelugu,