నాకు నచ్చింది చేస్తా.. మధ్యలో మీకేంటి సమస్య.. ఇచ్చిపడేసిన ఇనయా

నాకు నచ్చింది చేస్తా..  మధ్యలో మీకేంటి సమస్య.. ఇచ్చిపడేసిన ఇనయా

ఒక్క ఇంటర్వ్యూ.. అది కూడా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopalvarma)తో.. దెబ్బకు ఫేమస్ అయిపొయింది ఇనయా సుల్తానా(Inaya Sulthana). ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ సీజన్ 6(Bigg boss season6)లోకి అడుగుపెట్టింది. తన ఆటతో, మాటలతో చాలా మంది అభిమానులను కూడా సంపాదించుకుంది ఈ బ్యూటీ. అయితే బిగ్ బాస్ తరువాత తనకు వరుసగా అవకాశాలు వస్తాయని భావించిన ఈ బ్యూటీ ఫేట్ మాత్రం అస్సలు మారలేదు. బిగ్ బాస్ సీజన్ 6 ముగిసి దాదాపు సంవత్సరం గడుస్తున్నా.. ఒక్కటంటే ఒక్క అవకాశాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. 

ఇందులో భాగంగానే తన ఫేట్ మారడం కోసం ప్రముఖ పూజారి వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఈ పూజకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మేడలో పూలమాల వేసుకొని కూర్చున్న ఇనయా తలపై కలశంతో నీళ్లు పోస్తూ కనిపించారు వేణు స్వామి. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఇనయాపై ట్రోల్స్ చేస్తున్నారు. నిజానికి ఇనయా ఒక ముస్లిం అమ్మాయి. అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు నెటిజన్స్. 

నువ్వు ముస్లిం కదా.. పూజలు చేస్తున్నావేంటి? అంటూ కామెంట్స్ చేశారు. దాంతో కాస్త సహనం కోల్పోయిన ఇనయా.. నేను భారతదేశంలో ఉన్నాను. ఇక్కడ నచ్చింది చేయగలిగే స్వేచ్ఛ నాకుంది. మధ్యలో నీకేంటి సమస్య? అంటూ సాలిడ్ కౌంటర్‌ ఇచ్చింది. మరి వేణు స్వామితో పూజలు చేయించుకున్న తరువాత అయినా ఆమె ఫేట్ ఏమైనా మారుతుందా అనేది చూడాలి.