పట్టు బిగిస్తున్న న్యూజిలాండ్

పట్టు బిగిస్తున్న న్యూజిలాండ్

కాన్పూర్ టెస్ట్ లో న్యూజిలాండ్ పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ  కోల్పోకుండా 129/0 స్కోర్ చేసింది. టామ్ లాథమ్ (50), వాల్ యంగ్(75) ఆచితూచి ఆడుతున్నారు. అంతకుముందు  258/4 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 345 పరుగులకు ఆలౌట్ అయింది. ఆరంగేట్రం బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్ (105) సెంచరీ చేశాడు.