IND vs ENG 4th T20: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ లో వరుస ఓటములతో భారత జట్టు వెనకబడి పోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0–2తో వెనుకంజలో ఉన్న ఇండియన్ క్రికెట్ జట్టు ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉంది. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈరోజు (గురువారం, జులై 9న) బ్రిస్టల్‌లో జరగబోయే నాలుగో టీ20లో టీమిండియా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయోగాలు విఫలమవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి, ఈ కీలక మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పులు చేసేందుకు ఇండియా మేనేజ్‌మెంట్ సిద్ధమైంది.
ప్లేయింగ్ ఎలెవన్‌లో మేజర్ చేంజెస్:
బ్రిస్టల్ మ్యాచ్‌కు ముందు అందరి దృష్టి స్టార్ వికెట్ కీపర్ సంజు శాంసన్ కమ్‌బ్యాక్‌పైనే ఉంది. ఇటీవల భారత్ సాధించిన టీ20 వరల్డ్ కప్ 2026 విజయ ప్రస్థానంలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన సంజును, ఫామ్ లేమి కారణంగా పక్కన పెట్టారు. కానీ, గత మ్యాచ్‌లో ఇండియా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడంతో, అతని అనుభవం జట్టుకు ఎంతో అవసరమనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.
తిలక్ వర్మపై వేటు పడే ఛాన్స్:
వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక తీవ్ర ఒత్తిడిలో ఉన్న తిలక్ వర్మ ఈ మ్యాచ్‌లో బెంచ్‌కు పరిమితం కానున్నట్లు సమాచారం. ఇంగ్లాండ్ పేస్, బౌన్స్‌ను తట్టుకోలేక గత మ్యాచ్‌లో 11 బంతుల్లో కేవలం 3 రన్స్ మాత్రమే చేసి అతడు పూర్తిగా విఫలమయ్యాడు. మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ లాంటి దిగ్గజాలు సైతం తిలక్ వర్మను పక్కన పెట్టి శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని బహిరంగంగానే సూచించారు.
సూర్యవంశీకి కూడా రెస్ట్:
15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని కూడా తుది జట్టు నుంచి తప్పించే యోచనలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇంగ్లాండ్‌లోని కఠినమైన పరిస్థితుల్లో, సిరీస్ వెనుకబడి ఉన్న సమయంలో ఇంత చిన్న వయసున్న ప్లేయర్ పై ఒత్తిడి పెంచడం సరైన నిర్ణయం కాదని భావిస్తున్నారు.
వాషింగ్టన్ సుందర్ ఎంట్రీ:
ఈ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత బ్యాటింగ్ లైనప్‌లో డెప్త్ (Depth) లోపించడంతో సుందర్ రాక జట్టుకు కలిసి రానుంది. బ్రిస్టల్ స్టేడియం పరిమాణాన్ని బట్టి చూస్తే, సుందర్ రూపంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు పవర్‌ప్లేలో ఒక నమ్మకమైన డిఫెన్సివ్ బౌలింగ్ ఆప్షన్‌తో పాటు 8వ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు అవకాశం ఉంది.
ALSO READ : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. ఇషాన్ నంబర్ 1.. రెండో స్థానంలో అభిషేక్
భారత ప్లేయింగ్ XI అంచనా:
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రేయస్ అయ్యర్ తన మొదటి విజయం కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. భారత జట్టులో స్థిరత్వం లేకపోవడంతో, సిరీస్ ఓటమి నుంచి తప్పించుకోవడానికి గంభీర్-అయ్యర్ ద్వయం ఈ వ్యూహాత్మక మార్పులను ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటారో అనేది చూడాలి మరీ.
🚨 LATEST UPDATE ON INDIA'S PROBABLE PLAYING XI FOR THE 4TH T20I VS ENGLAND 🚨
— indianTeamCric (@Teamindiacrick) July 9, 2026
Team India could make a few changes ahead of the 4th T20I game against England .
• Sanju Samson is expected return to the Playing XI and could bat at No. 3.
• Vaibhav Suryavanshi is likely to… pic.twitter.com/Jgpeaeyyxm
