IND vs SA 1st Test: 408 ఆలౌట్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ద‌క్షిణాఫ్రికా

IND vs SA 1st Test: 408 ఆలౌట్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ద‌క్షిణాఫ్రికా

సొంత‌గ‌డ్డపై భారత్ తో జ‌రుగుతున్న తొలి టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో ద‌క్షిణాఫ్రికా 408 పరుగుల వద్ద ఆలౌటైంది. గాయం కారణంగా బవుమా బ్యాటింగ్‌కు రాకపోవడంతో 9 వికెట్లకే సఫారీ జట్టు ఆలౌటైనట్లు అంపైర్లు ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 163 పరుగుల ఆధిక్యం సంపాదించింది. సఫారీ బ్యాటర్లలో  డీన్‌ ఎల్గర్‌ (185) భారీ సెంచరీతో కదం తొక్కగా.. మార్కో జాన్‌సేన్ (84), బెడ్డింగ్ హమ్(56) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్‌ కృష్ణ, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.

రోహిత్ డకౌట్

అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(0) డకౌట్ గా వెనుదిరిగాడు. రబాడ బౌలింగ్ లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆపై కొద్దిసేపటికే జైస్వాల్(5)ను బర్గర్ పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతానికి టీమిండియా 150 పరుగుల వెనుకంజలో ఉంది.