IND-W vs ZIM-W: భారత మహిళా క్రికెట్ జట్టు (India Women) వర్సెస్ జింబాబ్వే మహిళల జట్టు (Zimbabwe Women) మధ్య మూడు వన్డేల సిరీస్‌లోని తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత సారథి స్మృతి మంధాన (Smriti Mandhana) ముందుగా బౌలింగ్ తీసుకుంది.
టీమిండియా కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ.. రాబోయే ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Women's Champions Trophy) సన్నాహకాల్లో భాగంగా, మంచు ప్రభావం (Dew Factor) ఎక్కువగా ఉండే రాత్రి సమయాల్లో ఛేజింగ్ చేసే అనుభవాన్ని సాధించడమే లక్ష్యంగా ముందుగా బౌలింగ్ తీసుకున్నట్లు స్మృతి వెల్లడించింది. కాగా రాబోయే టోర్నీలను దృష్టిలో పెట్టుకుని ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు (అరుంధతి రెడ్డి, నందని శర్మ, క్రాంతి గౌడ్) ఇద్దరు స్పిన్నర్ల (దీప్తి శర్మ, శ్రీ చరణి) లతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపింది. షెఫాలీ వర్మ ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా ఉండబోతున్నట్లు తెలిపింది.
జింబాబ్వే కెప్టెన్ జోసెఫిన్ ఎన్కోమో మాట్లాడుతూ.. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సాధించిన చారిత్రాత్మక విజయం తమ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని పేర్కొనింది. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల కలయికతో ఉన్న తమ జట్టు భారత్ లాంటి బలమైన జట్టుతో ఆడి మంచి ప్రదర్శన ఇచ్చేందుకు ఉత్సాహంగా ఉందని పేర్కొంది.
ఇరు జట్ల తుది జట్టు:
భారత మహిళా జట్టు: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన (కెప్టెన్), అనుష్క శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, నికి ప్రసాద్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రీ చరణి, అరుంధతి రెడ్డి, నందని శర్మ, క్రాంతి గౌడ్.
జింబాబ్వే మహిళా జట్టు: న్యాషా గ్వాంజురా, చిపో ముగేరి-తిరిపానో, కేలిస్ ఎన్‌ధ్లోవు, బిలవ్డ్ బిజా, జోసెఫిన్ ఎన్కోమో (కెప్టెన్), మోడెస్టర్ ముపాచిక్వా (వికెట్ కీపర్), మిషెల్ మావుంగా, ఫ్రాన్సిస్కా చిపారే, ఒలిండర్ చారే, తెండాయ్ మకుషా, షార్న్ మేయర్స్.
