న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో రెండు టెస్ట్లు, ఐదు వన్డేలకు ఇండియా జట్టును సెలెక్టర్లు శుక్రవారం ప్రకటించారు. ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్ టెస్ట్ టీమ్లోకి తిరిగి వచ్చారు. 2025 ఇంగ్లండ్ టూర్ తర్వాత ఆకాశ్ దీప్ ఒత్తిడి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. గతేడాది ఇంగ్లండ్లో డెబ్యూ చేసిన కాంబోజ్ను అనూహ్యంగా టీమ్ నుంచి తప్పించారు. ఇక తొలి మూడు వన్డేలకు శుభ్మన్ గిల్ సారథ్యం వహించనుండగా, తర్వాతి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ప్రసిధ్ కృష్ణ, రిషబ్ పంత్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది.
తొలి మూడు వన్డేలకు జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీష్, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్, అర్ష్దీప్, ఇషాన్ కిషన్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.
చివరి రెండు వన్డేలకు జట్టు: శ్రేయస్ (కెప్టెన్), రోహిత్, కోహ్లీ, తిలక్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్దీప్ సింగ్, కుమార్ కుశాగ్ర, సిరాజ్, యష్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్.
టెస్ట్ జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, జడేజా, అన్షుల్ కాంబోజ్, బుమ్రా, ఆకాశ్ దీప్, సాయి సుదర్శన్, నితీష్ కుమార్, సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్.
