ఇండియాలో బటన్ నొక్కుడు.. పాకిస్తాన్ లో పేలుడు : హార్పీ డ్రోన్స్ తో చెలరేగిపోతున్న ఇండియన్ ఆర్మీ

ఇండియాలో బటన్ నొక్కుడు.. పాకిస్తాన్ లో పేలుడు : హార్పీ డ్రోన్స్ తో చెలరేగిపోతున్న ఇండియన్ ఆర్మీ

టెక్నాలజీ వాడకం అంటే ఇలా ఉండాలి.. యుద్ధ వ్యూహాలు అంటే ఇలా ఉండాలి.. ఇండియాలో బటన్ నొక్కితే పాకిస్తాన్ లో పేలుడు.. అవును.. ఇప్పుడు ఇండియా ఇలాగే చెలరేగిపోతుంది. పాకిస్తాన్ దేశానికి.. ఆ దేశ ఆర్మీకి చుక్కలు చూపిస్తుంది మన ఆర్మీ. దీనికి కారణం ఏంటో తెలుసా.. హార్పీ డ్రోన్స్.. ఈ డ్రోన్ బాంబ్స్ ద్వారా పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది ఇండియన్ ఆర్మీ. ఇప్పటికే హార్పీ డ్రోన్స్ ప్రమోగం ద్వారా.. పాకిస్తాన్ వైమానిక శాఖ.. ఎయిర్ ఫోర్స్ కు చెందిన రక్షణ వ్యవస్థలను కుప్పకూల్చింది ఇండియా. జస్ట్ 36 గంటల్లోనే.. హార్పీ డ్రోన్స్ ద్వారా 1600 కోట్ల విలువైన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ రక్షణ వ్యవస్థలను నాశనం చేసింది ఇండియన్ ఆర్మీ.. 

చాలా సింపుల్ గా.. వ్యూహాత్మకంగా..

చాలా చాలా సింపుల్ గా పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బలు కొడుతుంది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ లోని ప్రదేశాన్ని టార్గెట్ ఫిక్స్ చేయటం.. ఆ తర్వాత ఇండియాలోనే ఉండి బటన్ నొక్కటం.. గాల్లోకి రువ్వున హార్పి డ్రోన్ దూసుకెళ్లటం.. పాక్ లోని రక్షణ వ్యవస్థలను పేల్చేయటం.. అంతే.. పాకిస్తాన్ ఆర్మీ కళ్లు మూసి తెరిచే లోపు ఫినిష్ చేసేస్తోంది ఇండియన్ ఆర్మీ. 

ఏంటీ హార్పీ డ్రోన్స్.. దీని ప్రత్యేకతలు ఏంటీ..?

>>> హార్పీ డ్రోన్.. 1989లో ఇజ్రాయెల్ తయారు చేసింది. సక్సెస్ అయ్యింది. ఈ తర్వాత నుంచి దీన్ని అప్ డేట్ చేస్తూ.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన డ్రోన్ ఎటాక్ కు మారుపేరుగా మారిపోయింది.
>>> ఒక్కసారి ఈ హార్పీ డ్రోన్ గాల్లోకి లేచింది అంటే.. పగలూ రాత్రీ అని తేడా లేదు.. 9 గంటలు నిర్విరామంగా పని చేస్తుంది. 
>>> హార్పీ డ్రోన్ టార్గెట్ రేంజ్ ఎంతో తెలుసా.. అక్షరాల వెయ్యి కిలోమీటర్లు.
>>> ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా.. ఇది 100 శాతం కచ్చితత్వంతో టార్గెట్ రీచ్ అవ్వటం దీని స్పెషల్.
>>> ఈ హార్పీ డ్రోన్.. రంగు ఆధారంగానూ టార్గెట్ రీచ్ అయ్యే విధంగా పని చేస్తుంది. అంతే కాదు ముందుకు, వెనక్కి ఎటు కావాలంటే అటు టార్గెట్ రీచ్ అయ్యేలోపు దిశలను మార్చుకునే వీలుంది. అంతే కాకుండా సెన్సార్లను చేధించుకుని వెళుతుంది. రాడార్ సైతం పసికట్టలేని విధంగా తన టార్గెట్ పూర్తి చేయటంలో హార్పీ డ్రోన్ స్పెషాలిటీ.
>>> ఒక్కో హార్పీ డ్రోన్.. 23 కిలోల బరువైన పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. శత్రు దేశాల రాడార్, క్షిపణి, రహస్య స్థావరాలతోపాటు మొబైల్ వ్యవస్థలను స్తంభించజేయగలరు.. అంటే జామర్లుగానే పని చేయగలదు. 

ఇదీ హార్పీ డ్రోన్ పని తీరు. ఇప్పుడు పాకిస్తాన్ దేశంలోని వైమానిక రక్షణ వ్యవస్థలను కుప్పకూల్చటంలో ఇండియా ఈ డ్రోన్లను ఉపయోగిస్తుంది. డ్రోన్లకు బాంబులు అమర్చటం.. ఇండియాలో బటన్ నొక్కటం.. పాకిస్తాన్ దేశంలో టార్గెట్ రీచ్ కావటం.. 48 గంటలుగా ఇండియా ఈ డ్రోన్ల సాయంతోనే.. పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపిస్తుంది.. ఇండియన్ ఆర్మీ చెలరేగిపోతుంది.. పాకిస్తాన్ కకావికలం అవుతుంది.