జింబాబ్వేకు చుక్కలు చూపించిన షెఫాలీ, హర్మన్ ప్రీత్ కౌర్.. 92 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ

జింబాబ్వేకు చుక్కలు చూపించిన షెఫాలీ, హర్మన్ ప్రీత్ కౌర్.. 92 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ

టీమిండియా, జింబాబ్వే మహిళల జట్ల మధ్య జరిగిన మూడో టీ20 క్రికెట్ మ్యాచ్లో టీమిండియా అమ్మాయిలు అదరగొట్టారు. 92 పరుగుల తేడాతో జింబాబ్వే జట్టుపై ఘన విజయం సాధించారు. 3 టీ20ల సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేయడంతో జింబాబ్వే మహిళా క్రికెట్ జట్టుకు వైట్ వాష్ తప్పలేదు. మూడో టీ20లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఉమెన్స్ జట్టు బ్యాటింగ్లో అదరగొట్టింది.

షెఫాలీ వర్మ 5 సిక్సులు, 6 ఫోర్లతో 69 పరుగులు చేసి జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడింది. హర్మన్ ప్రీత్ కౌర్ కూడా 41 బంతుల్లో 5 సిక్సులు, 10 ఫోర్లతో 91 పరుగుల చేసి నాటౌట్గా నిలిచింది. అనుష్క శర్మ 28 పరుగులు చేసింది. టీమిండియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు మొదటి ఓవర్లో మొదటి బంతికే వికెట్ సమర్పించుకుంది.

కెలిస్ ఎండ్లోవు డకౌట్గా వెనుదిరిగింది. 12 పరుగులకే రెండు వికెట్లు, 94 పరుగులకు మూడు వికెట్లు, 103 పరుగులకు నాలుగు వికెట్లు, 120 పరుగులకు ఐదు వికెట్లు, 122 పరుగులకు 6 వికెట్లు, 123 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 92 పరుగుల తేడాతో టీమిండియా మహిళల జట్టు ఘన విజయం సాధించింది. 

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా అమ్మాయిలు సమష్టిగా రాణించడంతో టీమిండియా మహిళల జట్టు మూడో టీ20 మ్యాచ్ను కూడా ఖాతాలో వేసుకుంది. మూడు వన్డేల సిరీస్లో  అక్టోబర్ 23న టీమిండియా, జింబాబ్వే మహిళా జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది.