అగ్నివీర్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 01.
ఖాళీలు: 25,000. అగ్నివీర్ (జనరల్ డ్యూటీ, టెక్నికల్, అసిస్టెంట్, ట్రేడ్స్‌మన్, సోల్జర్ టెక్నికల్, సిపాయి ఫార్మా, జేసీఓ రిలీజియన్ టీచర్).T
ఎలిజిబిలిటీ
అగ్నివీర్ (జనరల్ డ్యూటీ): కనీసం 45 శాతం మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి.
అగ్నివీర్ (టెక్నికల్): కనీసం 50 శాతం మార్కులతో ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి లేదా టెక్నికల్ డిప్లొమా కలిగి ఉండాలి.
అగ్నివీర్ (క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి.
అగ్నివీర్ (ట్రేడ్స్‌మన్ మెన్): 8వ తరగతి లేదా 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి
అగ్నివీర్ జీడీ/ టెక్నికల్/ అసిస్టెంట్/ ట్రేడ్స్ మన్: 17 1/2 నుంచి 21 ఏండ్లు ఉండాలి.
సోల్జర్ టెక్నికల్: 17 1/2 నుంచి 23 ఏండ్లు ఉండాలి.
సిపాయి ఫార్మా: 19 నుంచి 25 ఏండ్లు ఉండాలి.
జేసీఓ రిలీజియస్ టీచర్: 26 నుంచి 34 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 01.
ఆన్ లైన్ ఎగ్జామ్ తేదీలు: 2026, జూన్ 1 నుంచి 15 వరకు (తాత్కాలికం).
సెలెక్షన్ ప్రాసెస్: ఫేజ్– I: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (సీఈఈ) ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో అడుగుతారు.
ఫేజ్-II: సీఈఈలో సాధించిన మార్కులు, ఖాళీల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు నిర్దేశించిన ప్రాంతంలో రిక్రూట్ మెంట్ ర్యాలీ ఉంటుంది. ఇందులో భాగంగా ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. పూర్తి వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
