ఇండియన్ ఆర్మీలో భారీగా ఉద్యోగాలు: టెన్త్ అర్హత ఉంటే చాలు.. మే 31 లాస్ట్ డేట్..

ఇండియన్ ఆర్మీలో భారీగా ఉద్యోగాలు: టెన్త్ అర్హత ఉంటే చాలు.. మే 31 లాస్ట్ డేట్..

ఇండియన్ ఆర్మీ సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు: సివిలియన్ స్విచ్చ్​ బోర్డ్ ఆపరేటర్ (సీఎస్​బీఓ) గ్రేడ్–II, గ్రూప్–సి.

మొత్తం ఖాళీలు:  190 (పీడబ్ల్యూబీడీ 12, ఎక్స్ సర్వీస్​మన్ 20 పోస్టులను కలుపుకుని).

ఎలిజిబిలిటీ: గుర్తింపు బోర్డు నుంచి మెట్రిక్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. ప్రైవేట్ బోర్డ్ ఎక్స్ఛేంజ్ (పీబీఎక్స్) బోర్డును నిర్వహించడంలో నైపుణ్యంతోపాటు కనీసం 6 నెలల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇంగ్లిష్​, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగాలి. 

వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మే 2.

లాస్ట్ డేట్: మే 31.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ joinindianarmy.nic.inను సందర్శించండి.  

ఎగ్జామ్ ప్యాటర్న్
రాత పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్–Iలో జనరల్ ఇంటెలిజెన్స్ & న్యుమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, పార్ట్–IIలో జనరల్ అవేర్​నెస్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, పార్ట్–IIIలో జనరల్ ఇంగ్లిష్​ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, పార్ట్–IVలో లాజిక్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు అడుగుతారు.