ఇండియన్ ఆర్మీలో స్పెషల్ ఎంట్రీ ఉమెన్ పోస్టులు..నెలకు రూ. 56 వేల జీతం

 ఇండియన్ ఆర్మీలో స్పెషల్ ఎంట్రీ ఉమెన్ పోస్టులు..నెలకు రూ. 56 వేల జీతం

ఇండియన్ ఆర్మీ ఎన్​సీసీ స్పెషల్ ఎంట్రీ ఉమెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మార్చి 16.

ఖాళీలు: 06 (షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్–ఎన్ సీసీ ఉమెన్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎన్​సీసీ  సీనియర్ డివిజన్/ వింగ్‌‌‌‌లో కనీసం రెండు– మూడేండ్లు పనిచేసి ఉండాలి.  ఎన్​సీసీ ‘సి’ సర్టిఫికెట్ పరీక్షలో కనీసం 'బీ' గ్రేడ్ పొంది ఉండాలి. అవివాహితులై ఉండాలి. 
వయోపరిమితి:  2026, జులై 1 నాటికి 19 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. లేదా 2001, జులై 02 కంటే ముందు గానీ 2007, జులై 1 తర్వాత గానీ జన్మించిన వారై ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 13.
లాస్ట్ డేట్: మార్చి 16. 
ఎస్ఎస్​బీ ఇంటర్వ్యూ: 2026, మే/ జూన్.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, రెండు దశల ఎస్​ఎస్​బీ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్​సైట్​ను సందర్శించండి. 
ఇండియన్ ఆర్మీ ఎన్​సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 124వ కోర్సు (2026, అక్టోబర్) ఎంపికైన అభ్యర్థులకు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో 49 వారాలపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణా కాలంలో ప్రతి నెలా రూ.56,100 స్టైఫండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులను లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.