భారత ఆర్మీ అధికారులు చాలా బాగా చూసుకున్నారు: తప్పిపోయి వచ్చిన పాక్ అమ్మాయిలు

భారత ఆర్మీ అధికారులు చాలా బాగా చూసుకున్నారు: తప్పిపోయి వచ్చిన పాక్ అమ్మాయిలు

సరిహద్దు దాటి.. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి జమ్మూకశ్మీర్ లోకి ప్రవేశించిన ఇద్దరు బాలికలను ఆర్మీ అధికారులు తిరిగి వెనక్కి పంపించారు.  నిన్న ఉదయం పూంచ్ సెక్టార్ లో ఇద్దరు అమ్మాయిలు.. భారత్ వైపు రావడం గమనించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారితో మాట్లాడారు. దారితప్పి వచ్చినట్టు నిర్దారించుకుని.. వారిని ఇవాళ పాక్ ఆర్మీ అధికారులకు అప్పగించారు. భారత ఆర్మీ అధికారులు తమను చాలా బాగా చూసుకున్నారన్నారు అమ్మాయిలు.