400 ఫీట్ల బోరుబావిలో పడిపోయిన 12 ఏళ్ల బాలిక

400 ఫీట్ల బోరుబావిలో పడిపోయిన 12 ఏళ్ల బాలిక

బోరు వేసిన అనంతరం దానిని పూడ్చి వేయాలని అధికారులు నెత్తినోరు మొత్తుకుంటున్నా.. కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదవశాత్తు అందులో కొంతమంది పడి చనిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. అందులో రెస్క్యూటీం కొంతమందిని రక్షిస్తున్నారు. తాజాగా..ఇలాంటి ఘటనే గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఏకంగా 12 ఏళ్లున్న బాలిక అందులో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. Gajanvav ప్రాంతంలో Dhrangadhra గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ ఏరియాలో 400 అడుగుల లోతున్న బోరుబావి ఉంది. దానిని అలాగే వదిలేశారు.

ప్రమాదవశాత్తు 12 ఏళ్ల బాలిక అందులో పడిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఆర్మీ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోనికి ఆక్సిజన్ అందించారు. అత్యాధునిక టెక్నాలజీ లోనికి పంపించి..బాలిక 60 అడుగుల లోతులో పడినట్లు గుర్తించారు. ఎలాగోలా కష్టపడి బాలికను పైకి తీశారు. ఆమె ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగానే ఉందని గుజరాత్ పీఆర్ ఓ (PRO) డిఫెన్స్ వెల్లడించింది.