ఆర్మీలో జాబ్స్.. అప్లై చేసుకోండిలా..

ఆర్మీలో జాబ్స్.. అప్లై చేసుకోండిలా..

చెన్నైలోని ఆఫీస‌‌ర్స్ ట్రెయినింగ్ అకాడ‌‌మీ(ఓటీఏ) ఏప్రిల్‌‌ 2023 సంవ‌‌త్సరానికి గాను 60వ షార్ట్ స‌‌ర్వీస్ క‌‌మిష‌‌న్(టెక్) మెన్‌‌, ‌‌31వ షార్ట్ స‌‌ర్వీస్ క‌‌మిష‌‌న్ (టెక్‌‌‌‌) ఉమెన్ కోర్సులకు ఇండియన్​ ఆర్మీ నోటిఫికేష‌‌న్ విడుద‌‌ల చేసింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిన‌‌ అవివాహిత పురుషులు, మ‌‌హిళ‌‌లు, డిఫెన్స్ ప‌‌ర్సన‌‌ల్ విడోస్ నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

ఖాళీలు: మొత్తం 191 ఖాళీలు ఉన్నాయి. ఇందులో షార్ట్ స‌‌ర్వీస్ క‌‌మిష‌‌న్‌‌ (టెక్) మెన్‌‌ పోస్టులు175, ఎస్ఎస్‌‌సీ (టెక్‌‌) ఉమెన్‌‌ పోస్టులు 14తో పాటు విడోస్ డిఫెన్స్ ప‌‌ర్సన‌‌ల్‌‌ పోస్టులు 2 ఉన్నాయి.
విభాగాలు: సివిల్‌‌/ బిల్డింగ్ క‌‌న్‌‌స్ట్రక్షన్ టెక్నాల‌‌జీ, ఆర్కిటెక్చర్‌‌, మెకానిక‌‌ల్‌‌, ఎల‌‌క్ట్రిక‌‌ల్‌‌/ ఎల‌‌క్ట్రిక‌‌ల్ అండ్ ఎల‌‌క్ట్రానిక్స్, ఎల‌‌క్ట్రానిక్స్‌‌, కంప్యూట‌‌ర్ సైన్స్‌‌, ఇన్ఫర్మేష‌‌న్ టెక్నాల‌‌జీ, ఎల‌‌క్ట్రానిక్స్ అండ్ క‌‌మ్యూనికేష‌‌న్‌‌, టెలీక‌‌మ్యూనికేష‌‌న్ త‌‌దిత‌‌ర విభాగాలు ఉన్నాయి.

అర్హత‌‌: ఎస్ఎస్‌‌సీ(టెక్‌‌) మెన్‌‌/ విమెన్ - సంబంధిత స‌‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎస్ఎస్‌‌సీ విడోస్ (నాన్ టెక్నిక‌‌ల్‌‌)(నాన్ యూపీఎస్సీ)- ఏదైనా గ్రాడ్యుయేష‌‌న్, ఎస్ఎస్‌‌సీ విడో (టెక్నిక‌‌ల్‌‌)-బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత‌‌. ఎస్ఎస్‌‌సీ (టెక్‌‌) మెన్‌‌/ ఉమెన్ క్యాండిడేట్స్​కు 20- నుంచి 27 ఏళ్ల మ‌‌ధ్య ఉండాలి. ఎస్ఎస్‌‌సీ విడోస్ (నాన్ టెక్నిక‌‌ల్‌‌)(నాన్ యూపీఎస్సీ), ఎస్ఎస్‌‌సీ విడో (టెక్నిక‌‌ల్‌‌)- అభ్యర్థులకు 35 ఏళ్లు మించ‌‌కూడదు.

సెలెక్షన్స్​: చివరి సెమిస్టర్‌‌/ ఏడాదిలో సాధించిన మెరిట్‌‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌‌లిస్ట్‌‌ చేస్తారు. షార్ట్‌‌లిస్ట్‌‌ చేసిన అభ్యర్థుల్ని ఎస్ఎస్‌‌బీ ఇంట‌‌ర్వ్యూ, మెడిక‌‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌‌లైన్ ద్వారా ఆగస్టు 24 వరకు ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవచ్చు. సమాచారం కోసం www.joinindianarmy.nic.in వెబ్​సైట్ చూసుకోవాలి.