
భారతీయ గేమింగ్ కంపెనీ ఇండో-ఫ్యూచరిస్టిక్.. ఆన్ లైన్ గేమర్స్ కి శుభవార్త చెప్పింది. పబ్జీకి గేమ్ కి పోటీగా కొత్త ఆన్ లైన్ గేమ్ ని తీసుకురానుంది. ‘ఇండస్ బ్యాటిల్ రాయల్’ పేరుతో తెస్తున్న ఈ గేమ్ పూర్తిగా భారత్ లో తయారుచేశారు. బ్యాటిల్ రాయల్ ఫోన్ పార్ట్నర్షిప్ తో ఇండస్ గేమ్ ని డెవలప్ చేశారు. కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్, పబ్జీ, ఫోర్ట్ నైట్ గేమ్స్ లా ఇండస్ బ్యాటిల్ రాయల్ ఉండబోతుంది. ప్రస్తుతం ప్రి ఆల్ఫా స్టేజ్ లో ఉన్న ఈ గేమ్ ను త్వరలోనే డెవలప్ చేసి అందుబాటులోకి తీసుకొస్తారట. అయితే, గేమ్ ఓవర్ వ్యూ కోసం యూట్యూబ్ లో ట్రైలర్ విడుదల చేశారు. గేమ్ కోసం ఇప్పటినుంచే ప్లే స్టోర్ లో ప్రి రిజిస్ట్రేషన్ మొదలుపెట్టారు. గేమింగ్ లవర్స్ ఇండియన్ మేడ్ బ్యాటిల్ రాయల్ గేమ్ కావాలంటే ఈ గేమ్ పై ఓ లుక్ వేయొచ్చు.