సౌదీలోని మనోళ్లకు ఎంబసీ అడ్వైజరీ..మిస్సైల్స్‌‌‌‌‌‌‌‌ దాడులను రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేయొద్దని హెచ్చరిక

సౌదీలోని మనోళ్లకు ఎంబసీ అడ్వైజరీ..మిస్సైల్స్‌‌‌‌‌‌‌‌ దాడులను రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేయొద్దని హెచ్చరిక

రియాద్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీలోని ఇండియన్లు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. యెమెన్‌‌‌‌‌‌‌‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీపై వరుసగా మిస్సైల్స్‌‌‌‌‌‌‌‌, డ్రోన్లతో విరుచుపడుతుంటంతో అక్కడి మన ఎంబసీ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. సౌదీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మిస్సైల్స్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకుంటున్న వీడియోలను గానీ, అవి కూలిన ప్రదేశాలను గానీ రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదా ఇతరులతో పంచుకోవడం పూర్తిగా నిషేధమని స్పష్టంచేసింది.

ఈమేరకు సౌదీ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ జారీ చేసిన ఆదేశాలను గుర్తుచేసింది. స్థానిక నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు, ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు భారత మిషన్ వెల్లడించింది.