
- ఇండియాలోని స్విస్ బ్యాంకుల బ్రాంచ్‌లలోని డిపాజిట్లు కలిపి..
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు ఏటేటా పెరుగుతున్నది. కిందటేడాది మూడు రెట్లు పెరిగి ఏకంగా రూ.37,600 కోట్లకు (3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్) చేరుకుంది. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం..
ఇండియాలోని స్విస్ బ్యాంకుల బ్రాంచ్‌లు, ఇతర ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ దగ్గర ఉన్న ఫండ్స్ భారీగా పెరగడం ఇందుకు కారణం. అయితే భారత కస్టమర్ల అకౌంట్స్‌లోని డబ్బు కేవలం 11శాతం పెరిగి 346 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (సుమారు రూ.3,675 కోట్లు) అయింది. ఇది మొత్తం ఫండ్స్‌లో పదో వంతు మాత్రమే.
2023లో భారతీయ వ్యక్తులు, కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో, లోకల్ బ్రాంచ్‌లు, ఇతర ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ద్వారా ఉంచిన ఫండ్స్ 70 శాతం తగ్గి నాలుగేళ్ల కనిష్టానికి అంటే 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (రూ.11 వేల కోట్ల)కు చేరిన విషయం తెలిసిందే. 2021లో భారత డబ్బు 3.83 బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్(రూ.40,598 కోట్ల) తో 14 ఏళ్ల గరిష్టాన్ని తాకింది.
ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్‌గా ఉంది. కాగా, ఇవి బ్యాంకులు స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్‌ఎన్‌బీ)కి రిపోర్ట్ చేసిన అధికారిక గణాంకాలు. భారతీయులు స్విట్జర్లాండ్‌లో ఉంచిన బ్లాక్ మనీ మొత్తాన్ని ఇవి చూపించవు. భారతీయులు, ఎన్‌ఆర్‌ఐలు, ఇతర దేశాల బేస్‌గా ఉన్న ఎంటీటీల పేరిట స్విస్ బ్యాంకుల్లో ఉంచిన డబ్బు ఈ గణాంకాల్లో లేదు. 2023 చివరి నాటికి భారత క్లయింట్స్ స్విస్ బ్యాంకుల్లో ఉంచింది కేవలం 3,545.54 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లే (రూ.3,758 కోట్లు).
భారత ప్రభుత్వానికి వివరాలు ఇస్తున్నాం..
భారతీయులు స్విట్జర్లాండ్‌లో ఉంచిన ఆస్తులను ‘బ్లాక్ మనీ’గా భావించకూడదని.. ట్యాక్స్ ఫ్రాడ్, ఎగవేతకు వ్యతిరేకంగా భారత్‌కు యాక్టివ్‌గా సపోర్ట్ చేస్తామని స్విస్ అధికారులు చెబుతున్నారు. 2018 నుంచి ఆటోమేటిక్‌గా వివరాలను స్విట్జర్లాండ్, ఇండియా పంచుకుంటున్నాయి.
స్విస్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అకౌంట్స్ ఉన్న భారతీయుల వివరాలను 2019 సెప్టెంబర్‌లో మొదటిసారి భారత ట్యాక్స్ అధికారులకు స్విస్ అధికారులు ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఇది కొనసాగుతోంది.
అంతేగాక ఫైనాన్షియల్ ఫ్రాడ్స్‌లో ప్రమేయం ఉందని అనుమానించే వారి అకౌంట్లను కూడా యాక్టివ్‌గా ఇండియాకు అందిస్తున్నారు. స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాస్తున్న దేశాల్లో యూకే టాప్‌లో ఉంది ( 222 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్). ఆ తర్వాత యూఎస్ (89 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్), వెస్టిండీస్ ( 68 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్) ఉన్నాయి. భారత్ 48వ స్థానంలో ఉంది.
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బులు ఇలా..
- కస్టమర్ డిపాజిట్స్: 346 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (రూ.3,667 కోట్లు)
- ఇతర బ్యాంకుల ద్వారా: 3.02 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (రూ.32 వేల కోట్లు)
- ట్రస్ట్స్ ద్వారా: 41 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (రూ.434 కోట్లు)
- బాండ్స్, సెక్యూరిటీస్, ఇతర ఫైనాన్షియల్ అసెట్స్: 135 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (రూ.1,431 కోట్లు)