ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) 2026–-27 ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో జనరలిస్ట్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 291.
విభాగాల వారీగా ఖాళీలు
మేనేజర్ (బ్రాంచ్ మేనేజ్‌మెంట్) ఎంఎంఏజీఎస్ II 100, మేనేజర్ (ఐటీ) ఎంఎంఏజీఎస్II 65, మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) –ఎంఎంఏజీఎస్ II 5, మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిట్) ఎంఎంఏజీఎస్ II 5, సీనియర్ మేనేజర్ (ఐటీ) – ఎంఎంఏజీఎస్III 10, సీనియర్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) – ఎంఎంఏజీఎస్ III 3, సీనియర్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిట్)–ఎంఎంఏజీఎస్III 2, సీనియర్ మేనేజర్ (డేటాబేస్ ఆడ్మినిస్ట్రేటర్) – ఎంఎంఏజీఎస్III 10, సీనియర్ మేనేజర్ (నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్) ఎంఎంఏజీఎస్ III 5, సీనియర్ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్)–ఎంఎంఏజీఎస్III 5, మేనేజర్ (క్రెడిట్) –ఎంఎంఏజీఎస్ II 35, సీనియర్ మేనేజర్ (క్రెడిట్) –ఎంఎంఏజీఎస్ II 15, సీనియర్ మేనేజర్ (క్రెడిట్) ఎంఎంఏజీఎస్ II 15, సీనియర్ మేనేజర్ (క్రెడిట్) ఎంఎంఏజీఎస్ III 15, సీనియర్ మేనేజర్ (రిస్క్) ఎంఎంఏజీఎస్ III 6, అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ) జేఎంజీఎస్ I 25.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/ బి.టెక్ లేదా ఎంఈ/ ఎంటెక్ లేదా ఎంసీఏ, ఎంబీఏ/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ ఎంఎంఎస్ (ఫైనాన్స్) లేదా సీఏ లేదా సీఎంఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. ఉద్యోగ అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 2026, ఆగస్టు 1 నాటికి 22 నుంచి 38 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 28.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలు రూ.175, ఇతరులు రూ.1000 చెల్లించాలి.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 15.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.iob.bank.inను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
మేనేజర్ - బ్రాంచ్ మేనేజ్‌మెంట్ పోస్టులకు మొత్తం 100 మార్కులకుగాను 100 ప్రశ్నలతో ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు, 30 నిమిషాలు), ప్రొఫెషనల్ నాలెడ్జ్ (బ్యాంకింగ్ లా అండ్ ప్రాక్టీస్, ఇండియన్ ఎకానమీ అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ బ్యాంకింగ్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (75 ప్రశ్నలు, 90 నిమిషాలు)పై ఎగ్జామ్ ఉంటుంది.
ఇతర అన్ని పోస్టులకు 100 మార్కులకు 100 ప్రశ్నలతో 2 గంటల వ్యవధిలో పరీక్ష జరుగుతుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు, 30 నిమిషాలు), బ్యాంకింగ్ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ జనరల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు, 30 నిమిషాలు), పోస్టును మారే ప్రొఫెషనల్ నాలెడ్జ్ (50 ప్రశ్నలు, 60 నిమిషాలు) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
అర్హత మార్కులు, నెగెటివ్ మార్కింగ్: ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ విభాగాలకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు. అయితే, అభ్యర్థులు ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగంలో కచ్చితంగా కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్షలో జనరల్ అభ్యర్థులు 35 శాతం, రిజర్వ్డ్ అభ్యర్థులు 30 శాతం కనీస మార్కులు సాధించాలి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 1/4వ వంతు కోత విధిస్తారు.
ఇంటర్వ్యూ, తుది ఎంపిక
ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో జనరల్ అభ్యర్థులు 50 శాతం, రిజర్వ్డ్ అభ్యర్థులు 45 శాతం కనీస మార్కులు సాధించాలి.
వెయిటేజీ: ఆన్‌లైన్ పరీక్షకు 80 శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ కేటాయించి తుది మెరిట్ జాబితాను ఖరారు చేస్తారు.
