ఎందుకన్నా అంత రిస్క్​ చేశావ్​..కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి.. సెల్ఫీ దిగుతుండగా దాడి చేసిన పులి..వ్యక్తికి గాయాలు

ఎందుకన్నా అంత రిస్క్​ చేశావ్​..కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..  సెల్ఫీ దిగుతుండగా దాడి చేసిన పులి..వ్యక్తికి గాయాలు

పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో..చూసుకో.. పులితో ఫొటో దిగాలనిపించిందనుకో.. కొంచెం రిస్క్​ అయినా పర్వాలేదు ట్రై చేయొచ్చు..సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకోవాలని చూస్తే మాత్రం. వేటాడేస్తది.. ఈ డైలాగ్​ యమదొంగ సినిమాలోది కదా.. ఇప్పుడెందుకు అని అనుకుంటున్నారా.. యమదొంగ సినిమాలో జూనియర్​ ఎన్టీఆర్​ చెబితే.. ఇక్కడ జస్ట్​ ఛేంజ్ పులి చెప్పినట్టుంది ఈసీన్ లో ..థాయ్​ లాండ్​ లో  ఓ వ్యక్తి పులితో కాస్త చనువుగా ఉందామని ప్రయత్నించి ఆస్పత్రి పాలైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో బాగా వైరల్​ అవుతోంది..ఆ కథేంటో తెలుసుకుందాం.. 

థాయ్​ లాండ లోని ఫుకెట్​ లోని టైగర్​ కింగ్​ డమ్​ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో పులి దాడి చేయడంతో ఓ ఇండియన్​ కు స్పల్పంగా గాయాలయ్యాయి. ఆ వ్యక్తి పులితో సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో దాడి జరిగింది. సోషల్​ మీడియా ప్లాట్​ ఫాం X లో దీనికి సంబంధించిన వీడియో వైరల్​ అయింది. అయితే ఫేమస్​ పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు అక్కడి భద్రతా ప్రమాణాలను, జంతువుల సంక్షేమంపై ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 

Apparently an Indian man attacked by a tiger in Thailand.

This is one of those paces where they keep tigers like pets and people can take selfies, feed them etc etc.#Indians #tigers #thailand #AnimalAbuse pic.twitter.com/7Scx5eOSB4

— Sidharth Shukla (@sidhshuk) May 29, 2025

25 సెకన్ల ఈ వీడియాలో బాధిత వ్యక్తి పులి పక్కన నడుస్తూ కనిపిస్తున్నాడు. శిక్షకుడు దగ్గరలో కర్రతో నిలబడి పులిని కూర్చోమని సూచిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో బాధిత వ్యక్తి సెల్ఫీ తీసేందుకు ప్రయత్నిస్తుండగా..పులి అకస్మాత్తుగా ఉద్రేకంతో అతనిపై దాడి చేసింది. వీడియో అతని అరుపులు వినిపిస్తున్నాయి. అప్పటి వరకు భలే సరదాగా అనిపించిన దృశ్యం కాస్త వాయిలెంట్​ గా మారిపోయింది. 

Xయూజర్​ సిద్దార్థ్​శుక్లా ఈ వీడియోను షేర్​ చేశారు. బాధిత వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడని అని అడిగిన ప్రశ్నకు .. అవును చిన్న గాయాలతో బయటపడ్డాడని స్పందించారు. 
అయితే ఈఘటనకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లలో ఆందోళన రేకెత్తించాయి.టూరిస్టుల భద్రత, వన్యప్రాణుల పర్యాటక నైతికత గురించి చర్చకు దారి తీశాయి. 

ముఖ్యంగా పులిలాంటి ప్రమాదకరమైన జంతువులతో ఉన్నపుడు జాగ్రత్తగా ఉండాలని, ఫేమస్​ టూరిస్ట్​ ప్లేస్​ అయిన  ఫుకెట్​ లోని టైగర్​ కింగ్​ డమ్​ లో భద్రతాచర్యలు ఎందుకు పఠిష్టంగా అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఏదీ ఏమైనా పులిలాంటి క్రూరమృగాలతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.