కెనడా జాబ్ డ్రీమ్స్లో ఉన్నారా.. అక్కడ ఎలా ఎగబడుతున్నారో చూడండి.. ఇండియన్ స్టూడెంట్ వీడియో వైరల్ !

కెనడా జాబ్ డ్రీమ్స్లో ఉన్నారా.. అక్కడ ఎలా ఎగబడుతున్నారో చూడండి.. ఇండియన్ స్టూడెంట్ వీడియో వైరల్ !

విదేశాల్లో జాబ్స్ అంటే ఇండియన్స్ ఎక్కువగా ప్రెఫర్ చేసేది కెనడా. సింపుల్ గా వీసా రావడం.. అంతగా రిస్ట్రిక్షన్స్ లేకపోవడం.. ఎక్కువ మంది రిఫర్ చేయడం మొదలైన కారణాలతో స్టడీస్ , జాబ్స్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కెనడాకు ఇస్తుంటారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. జాబ్స్ కోసం ఆఫీసుల ముందు పడిగాపులు కాసే పరిస్థితి వచ్చింది. కేవలం ఇంటర్న్షిప్ కే ఒక్క పోస్ట్ కోసం వందల మంది ఎగబడటం చూస్తే కెనడా డ్రీమ్స్ ఆవిరవ్వాల్సిందే.

కెనడాలో ఉన్న పరిస్థితిని ఒక ఇండియన్ స్టూడెంట్ వీడియో షూట్ చేసింది ఇన్ స్టాలో షేర్ చేసింది. లోకల్ స్టూడెంట్స్ కంటే ఇంటర్నేషన్ స్టూడెంట్స్ ‘బాబ్బాబ్బాబ్.. చిన్ని జాబ్ అయినా పర్లేదు.. ఏదో ఒకటి ఇచ్చేయండి’ అన్నట్లుగా ఉందని వేడుకునే పరిస్థితి వచ్చిందని వీడియోలో తెలిపింది. ‘‘చాలా మంది ఇండియన్స్ కు ఫారెన్ లో మంచి జాబ్స్, బెటర్ లైఫ్ స్టైల్, ఉంటుందని భావిస్తుంటారు. కానీ అందుకు విరుద్ధంగా ఇక్కడ ఉన్న రియాలిటీ ఏంటో మీరే చూడండి’’ అని వీడియోలో కామెంట్ చేసింది. 

ఒక కంపెనీ 5 మందిని ఇంటర్న్షిప్ కు పిలిస్తే.. వందల మంది వచ్చి ఎగబడుతున్నారంట. ఇంటర్వ్యూూ పూర్తయ్యాక కూడా రిజల్ట్ అనౌన్స్ చేసే వరకు పడిగాపులు కాస్తున్నారట. కాల్ చేసి చెప్తాం అని చెప్పినా కూడా ఎదురుచూపులు చూస్తున్నారని చెప్పింది. ‘ఇది కెనడా రియాలిటీ. అబ్రాడ్ లో లైఫ్ అందకిరీ ఒక డ్రీమ్.. కానీ కొన్ని సార్లు బార్లు తీరిన క్యూ తప్పదు’ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కెనడాలో నిరుద్యోగం ఎలా ఉందో ఈ ఇన్సిడెంట్ చూస్తే తెలుస్తుందని ఆ యువది తెలిపింది. విదేశాల్లో ఉంటున్న ఇమ్మిగ్రెంట్స్ తో పాటు అబ్రాడ్ వెళ్లాలనుకే వారినుంచి కూడా మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. 

‘‘ చాలా మంది ఫారెన్ లో అద్భుతం.. సూపర్.. చాలా సంపాదించవచ్చు.. కూల్ లైఫ్ స్టైల్.. అంటూ ఇన్ ఫ్లుయెన్స్ చేస్తుంటారు. కానీ ఫస్ట్ టైమ్ రియాలిటీ ఏంటో చెప్పారు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

టొరంటోలో జాబ్ కావాలంటే చాలా సార్లు పడిగాపులు కాయాల్సిందేనని ఒకరు రిప్లై ఇచ్చారు. మరొకరు ‘‘ఈ వీడియో చూసే వరకు అందరూ కెనడాను ల్యాండ్ ఆఫ్ ఆపార్చునిటీ అనుకుంటారు..’’ అని కామెంట్ చేశారు. 
అయితే కొందరు భిన్నంగా స్పందించారు. ‘వీడియోలో చెప్పింది నిజమే కావచ్చు. కానీ రైట్ స్కిల్స్ ఉంటే ఇప్పటికీ మీరు జాబ్ కొట్టొచ్చు’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. 

కెనడాలో జాబ్స్ చాలా ఉన్నాయి.. షార్టేజ్ లేదు.. స్కిల్స్ మిస్ మ్యాచ్ ప్రాబ్లమ్..  మైక్రోసాఫ్ట్, అమెజాన్, బీసీ హైడ్రో, లులులెమన్, వాంకోవర్ కోస్టల్.. తదితర కంపెనీలు ఎప్పటికీ కొత్త వాళ్లను హైర్ చేసుకుంటూనే ఉన్నాయి. కేవలం ఎంట్రీ లెవెల్ జాబ్స్ మాత్రమే కాంపిటీషన్ ఎదుర్కొంటున్నాయి అని కొందరు అంటున్నారు.