గాంధీనగర్: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం వేళ దేశంలో ఇంధన పరిస్థితులపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచదేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని.. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ వంటి ఇంధన సరఫరాలపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్‌తో చమురు రవాణా ప్రపంచ దేశాలకు సవాల్‌గా మారిందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశ సమర్థవంతమైన విదేశాంగ విధానం, పౌరుల ఐక్యత కారణంగా దేశంలో ఇంధన పరిస్థితులు కంట్రోల్లోనే ఉన్నాయని తెలిపారు. ఇంధన సంక్షోభం వంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ పౌరుల్లో ధైర్యం నింపాల్సిందిపోయి భయం, పుకార్ల వ్యాపింపజేస్తుందని కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. సమాజంలో భయాందోళనలు, పుకార్లు వ్యాపింపజేస్తూ ప్రజలను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అస్థిర పరిస్థితులను కూడా కాంగ్రెస్ రాజకీయ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తోందని విమర్శించారు. దేశంలో భయాందోళన వాతావరణాన్ని సృష్టించి.. తద్వారా ప్రజలు పెట్రోల్ పంపులు, గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలో నిలబడాలని వస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోందని ఆరోపించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు 10 శాతం మేర పెరిగినప్పటికీ.. భారతీయులపై భారం పడకుండా చూసేందుకు కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు.
