హైదరాబాద్ మూవీ లవర్స్ దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న ఆ కల నెరవేరబోతోంది. నగరంలో మళ్లీ ఐమాక్స్ (IMAX) స్క్రీన్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఐకానిక్ సుదర్శన్ 70MM థియేటర్ రూపురేఖలు మారబోతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో ఉన్న 'AMB సినిమాస్' బ్రాండ్ కింద ఈ సరికొత్త 'AMB క్లాసిక్' మల్టీప్లెక్స్ రూపుదిద్దుకుంటోంది.
2వ అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్..
లేటెస్ట్ సమాచారం ప్రకారం.. సుదర్శన్ 70MM థియేటర్ ఇప్పుడు అత్యాధునిక 'IMAX with Laser' ఆడిటోరియంగా మారబోతోంది. ఇది భారతదేశంలోనే రెండో అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ కానుంది. 4K ప్రొజెక్షన్, అదిరిపోయే బ్రైట్‌నెస్, క్రిస్టల్ క్లియర్ విజువల్స్, మైండ్ బ్లోయింగ్ సౌండ్ సిస్టమ్‌తో ఈ స్క్రీన్ ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వనుందని AMB సినిమాస్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
'వారణాసి' లూప్..
ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకడానికి మరో ముఖ్య కారణం ఉంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అడ్వెంచరస్ ఫిల్మ్ 'వారణాసి' (Varanasi). ఈ సినిమాను పూర్తిస్థాయిలో ఐమాక్స్ సర్టిఫైడ్ కెమెరాలతో షూట్ చేస్తున్నారు. ఈ విజువల్ వండర్‌ను హైదరాబాద్ ఆడియన్స్ తమ సొంత నగరంలోనే ఐమాక్స్ స్క్రీన్‌పై ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
హిస్టారికల్ కంబ్యాక్..
ఒకప్పుడు ప్రసాద్స్ ఐమాక్స్ (Prasad's IMAX) ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌లలో ఒకటిగా హైదరాబాద్‌కు గర్వకారణంగా ఉండేది. కానీ సాంకేతిక కారణాల వల్ల 2015లో అక్కడ ఐమాక్స్ ఫార్మాట్ నిలిచిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు, అంటే 2026 చివరి నాటికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కొత్త ఐమాక్స్ స్క్రీన్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
IMAX చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జియోవన్నీ డోల్చి మాట్లాడుతూ.. హైదరాబాద్ సినిమా ప్రేక్షకులు ఐమాక్స్ కోసం పక్క రాష్ట్రాలకు ప్రయాణం చేయడం చూసి ఆశ్చర్యపోయాను. అందుకే ఇక్కడ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి ఏషియన్ సినిమాస్‌తో చేతులు కలిపాం అని పేర్కొన్నారు. ఏషియన్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ కూడా ఈ ప్రాజెక్ట్ తెలుగు సినిమా స్థాయిని పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు.
MAX PICTURE
— AMB Cinemas (@amb_cinemas) June 1, 2026
MAX SOUND
MAX IMMERSION
Introducing,
IMAX 🔥
Coming soon only at AMB Classic Victory, Hyderabad 🌟@IMAX @SureshProdns#IMAX #HomecomingwithAMBClassicVictory pic.twitter.com/OcuQfibz7N
