ఇంద్ర మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్

ఇంద్ర మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్

‘జైలర్’ చిత్రంలో రజినీకాంత్‌‌‌‌కు కొడుకుగా నటించి తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపును అందుకున్న వసంత్ రవి.. సోలో హీరోగా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. అతను హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ‘ఇంద్ర’ టైటిల్‌‌‌‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో శబరీష్ నందా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వసంత్ రవి ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.

రెండు విభిన్న ముఖాలతో ఉన్న పోస్టర్ ఇంప్రెస్ చేసింది.  సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో మెహ్రీన్‌‌‌‌ పిర్జాదా హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. అనికా సురేంద్రన్, సునీల్, కళ్యాణ్ మాస్టర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  జేఎస్ఎం పిక్చర్స్, ఎంపరర్ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.