ఇన్ స్టాలో క్యాట్‌‌ ఫిషింగ్ కు చెక్!

ఇన్ స్టాలో క్యాట్‌‌ ఫిషింగ్ కు చెక్!

ఇన్‌‌స్టాగ్రామ్​ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​తో క్రియేట్ చేసిన ఫొటోలు లేదా వీడియోల వల్ల జరిగే మోసాలను అరికట్టడానికి ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. సాధారణంగా కొంతమంది వ్యక్తులు కంప్యూటర్ సాయంతో నిజమైన మనుషులలాగే కనిపించే ఆర్టిఫిషియల్​ మనుషులను సృష్టించి ఇతరులను నమ్మించి మోసాలకు పాల్పడుతుంటారు. దీన్నే ‘క్యాట్‌‌ఫిషింగ్’ అని పిలుస్తుంటాం. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయడానికి, ఏదైనా ఒక చిత్రం లేదా వీడియో ఏఐతో తయారైతే దానికి ప్రత్యేకమైన గుర్తును లేదా పేరును కేటాయిస్తారు. 

దీనివల్ల యూజర్లు ఆ కంటెంట్ చూసినప్పుడు అది నిజమైన మనిషిదా లేక ఏఐ క్రియేషనా? అనేది ఈజీగా గుర్తించొచ్చు. యూజర్లు ఒకరిని చూసి మరొకరు అని పొరబడకుండా, సోషల్ మీడియాల్లో ట్రాన్స్​పరెన్సీని పెంచడం ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఒకవేళ ఎవరైనా ఏఐతో క్రియేట్ చేసిన విషయాలను పంచుకుంటే, వాటిపై స్పష్టమైన గుర్తులు ఉండేలా ఈ సంస్థ కఠిన నిబంధనలు పెట్టింది. 

దీనివల్ల సామాన్యులు తప్పుదారి పట్టకుండా జాగ్రత్త పడొచ్చు. ముఖ్యంగా నకిలీ ఖాతాల ద్వారా జరిగే ఆర్థిక లేదా వ్యక్తిగత ఇబ్బందులను తగ్గించడానికి ఈ కొత్త విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.  టెక్నాలజీ వల్ల కలిగే అనర్థాల నుంచి యూజర్లను ప్రొటెక్ట్ చేయడమే దీని లక్ష్యం.