విద్యార్థినిపై దాడి చేసిన భరత్ అరెస్ట్

విద్యార్థినిపై దాడి చేసిన భరత్ అరెస్ట్

హైదరాబాద్ : ఇంటర్‌ విద్యార్థినిపై కత్తితో దాడిచేసిన ప్రేమోన్మాది భరత్‌ ను పోలీసులు అరెస్టు చేశారు.  ‘‘విద్యార్థిని తనతో మాట్లాడటం లేదని ఈరోజు ఉదయం 8.45గంటలకు భరత్‌ అనే యువకుడు  ఆమెను అటకాయించి కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడని తెలిపారు పోలీసులు. ఈదాడిలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయని.. ప్రస్తుతం ఆమెకు యశోదా హస్పిటల్ లో ట్రీట్ మెంట్ అందిస్తున్నామన్నారు. నిందితుడు భరత్‌ కోసం నాలుగు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి మూసీ నది ఒడ్డున పట్టుకున్నామని తెలిపారు.

దాడికి ఉపయోగించిన కత్తిని అతని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన పోలీసులు.. బాధితురాలి ఇంటికి 15 అడుగుల దూరంలోనే నిందితుడి ఇల్లు కూడా ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఇరుకైన గల్లీలు ఉండటంతో దాడి జరుగుతున్న సమయంలో స్థానికులు సకాలంలో స్పందించ లేకపోయారని చెప్పారు.

“నెలక్రితం భరత్‌ ఆమెను వేధించడంతో ఇరు కుటుంబాల వారు వెల్ నెస్‌ సెంటర్‌ కు వెళ్లారు. సామరస్యంగానే పిల్లలను దూరంగా ఉంచాలని అనుకున్నారు. గతంలో స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లోనూ తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. పిల్లల మధ్య స్నేహం విషయం అక్కడ ఎవరికీ తెలియకూడదనుకున్నారు. ఇవాళ ఉదయం భరత్‌ కత్తితో దాడికి పాల్పడ్డాడు. భరత్‌ కు గతంలో నేర చరిత్ర ఏమీ లేదు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. నిందితుడిపై హత్యాయత్నం, ఫోక్సో కింద కేసులు పెడతాం’’ అని డీసీపీ రమేష్ తెలిపారు.  భరత్‌ ను ఇవాళే కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.