సంయుక్త మీనన్ నెక్ట్స్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్

సంయుక్త మీనన్ నెక్ట్స్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్

చేతినిండా సినిమాలతో ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిజీగా ఉంది హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంయుక్త మీనన్.  ‘భీమ్లానాయక్’తో తెలుగులోకి వచ్చిన ఆమె.. బింబిసార, సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విరూపాక్ష లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం తను ఎనిమిది సినిమాలతో బిజీగా ఉంది. వాటిలో ఓ లేడీ ఓరియంటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమా కూడా ఉంది. ‘చింత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వి’ ఫేమ్ యోగి ఈ చిత్రానికి దర్శకుడు. రాజేష్ దండా నిర్మిస్తున్నారు.  గత ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమా మొదలైంది. 

గతంలో రాక్షసి, భైరవి లాంటి టైటిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినిపించినప్పటికీ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ‘బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బాలకృష్ణతో ‘అఖండ 2’, విజయ్ సేతుపతికి జంటగా పూరి జగన్నాథ్ సినిమా, శర్వానంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘నారీ నారీ నడుమ మురారీ’, బెల్లంకొండ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా ‘హైందవ’, నిఖిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జోడీగా ‘స్వయంభు’ సినిమాల్లో సంయుక్త నటిస్తోంది. అలాగే కోలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లారెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘బెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’, బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘మహారాణి’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి.