పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల ఎనిమిదో పర్యటన..

పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల ఎనిమిదో పర్యటన..

పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటించింది. బుధవారం ( అక్టోబర్ 14 ) పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విదేశీ నిపుణుల బృందం నాలుగురోజుల పాటు పర్యటించనుంది. ఇప్పటికే ఏడుసార్లు పర్యటించిన నిపుణుల బృందం ఈ పర్యటనలో ప్రధాన డ్యామ్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులను తనిఖీ చేయనుంది.

ఈ పర్యటనలో విదేశీ నిపుణులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం, సీఎస్ఎంఆర్,వ్యాపోస్కోప్ సంస్థలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలనకు ముందు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ వోహ్రా అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.

విదేశీ నిపుణులు సీన్‌ హించ్‌బర్గర్‌, రిచర్డ్‌ డోనెల్లీ, డేవిడ్‌పాల్‌, గెయిన్‌ ఫ్రెన్‌కో డి సిక్కో అక్టోబర్ 18 వరకూ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనున్నారు.