ఇంటింటి రామాయాణం డబుల్ ఫన్

ఇంటింటి రామాయాణం డబుల్ ఫన్

రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, నరేష్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. సురేష్ నరెడ్ల దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. సినిమాకొస్తున్న రెస్పాన్స్ గురించి తెలియజేసేందుకు శనివారం ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించారు. నవ్య స్వామి మాట్లాడుతూ ‘మేం ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి సినిమాని థియేటర్‌‌‌‌‌‌‌‌లోనే చూడాలి. ఎందుకంటే కామెడీ సీన్స్‌‌‌‌ని నలుగురు కలిసి కూర్చొని చూస్తే ఆ కిక్ వేరే ఉంటుంది. ఫన్ డబుల్ అవుతుంది’ అని చెప్పింది. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్‌‌‌‌కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారన్నాడు దర్శకుడు సురేష్. నటులు అంజి, కవిత, బాలనటి చైత్ర పాల్గొన్నారు.