IPL 2024: రూ.13 కోట్ల ఆటగాడికి గుడ్‌బై.. 6 మందిపై వేటు వేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

IPL 2024: రూ.13 కోట్ల ఆటగాడికి గుడ్‌బై..  6 మందిపై వేటు వేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) జట్టు పేలవ ప్రదర్శన ఆ జట్టు యాజమాన్యాన్ని కళ్లు తెరిపించింది. ఐపీఎల్ 17వ సీజన్ లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా.. 16వ సీజన్‌లో విఫలమైన ఆటగాళ్లందరికి గుడ్ బై చెప్పింది. వీరిలో రూ.13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌తో పాటు ఆ జట్టు స్పిన్నర్ అదిల్ రషీద్ సహా మరో నలుగురు ఉన్నారు.

రాబోయే సీజన్ కోసం సన్‌రైజర్స్ 18 మంది ఆటగాళ్లను అంటిపెట్టుకోగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) నుండి షాబాజ్‌ నదీమ్‌ను ట్రేడ్‌ రూపంలో సొంతం చేసుకుంది. దీంతో అంటిపెట్టుకున్న ఆటగాళ్ల సంఖ్య 19కి చేరింది. 

ఎస్‌ఆర్‌హెచ్ రిలీజ్ చేసిన ఆటగాళ్ల లిస్ట్: హ్యారీ బ్రూక్, సమర్థ్ వ్యాస్, కార్తీక్ త్యాగి, వివ్రాంత్ శర్మ, అకేల్ హోసేన్ మరియు ఆదిల్ రషీద్. 

ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్: వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, సంవీర్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఐడెన్ మర్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, ఫజల్హాక్ ఫరూకీ, మయాంక్ మార్కండే, భవనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగి, హెన్రిచ్ క్లాసెన్, ఉపేంద్ర సింగ్ యాదవ్.