IPL 2026: ఇదే ఫైనల్.. ఐపీఎల్ 2026 అన్ని జట్ల కెప్టెన్స్ వీళ్లే.. 

IPL 2026: ఇదే ఫైనల్.. ఐపీఎల్ 2026 అన్ని జట్ల కెప్టెన్స్ వీళ్లే.. 

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2026) 19వ సీజన్‌ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీన ప్రారంభం కానున్న ఈ ఎడిషన్‌లో అన్ని జట్లు గట్టిగా జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే ఈసారి గాయాలు, ఆటగాళ్ల గైర్హాజరీలు అన్ని జట్లను ప్రభావితం చేస్తున్నాయి. అలాగే కొన్ని జట్లు కొత్త కెప్టెన్లను కూడా నియమించుకున్నాయి. దీంతో ఐపీఎల్ 2026లో అన్ని జట్ల కెప్టెన్ల పూర్తి జాబితాను ఇప్పుడు వీ6 తెలుగు వెబ్ సైట్ లో తెలుసుకుందాం.. 

చెన్నై సూపర్ కింగ్స్: 
రుతురాజ్ గైక్వాడ్ రెండోసారి చెన్నై జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు. గత సీజన్‌లో గాయంతో టోర్నీ నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిన గైక్వాడ్ ఈసారి పూర్తి సీజన్ ఆడే అవకాశం ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్: 
కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయంతో లీగ్ కి దూరం కావడంతో, ఈసారి ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. వైస్ కెప్టెన్‌గా అభిషేక్ శర్మని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నియమించింది. 

కోల్‌కతా నైట్ రైడర్స్: 
అజింక్య రహానే మరోసారి కేకేఆర్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గత సీజన్ నిరాశజనకంగా ముగిసినా, జట్టు అతనిపైనే మరోసారి నమ్మకం పెట్టుకుంది. 

ముంబై ఇండియన్స్: 
హార్దిక్ పాండ్యా మూడో సీజన్‌కు కూడా ముంబై జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఇంకా ఫైనల్ వరకు వెళ్లకపోయిన ఎంఐ టీమ్ 6వ సారి టైటిల్ కోసం తీవ్రంగా పోరాడనుంది.

లక్నో సూపర్ జెయింట్స్: 
రూ.27 కోట్లకు జట్టులో చేరిన రిషభ్ పంత్ మరోసారి లక్నో జట్టును నడిపించబోతున్నాడు. గత సీజన్‌లో నిరాశ కలిగించిన జట్టు ఈసారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉంది. 

పంజాబ్ కింగ్స్: 
శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ జట్టు మరోసారి బరిలోకి దిగుతోంది. గత సీజన్‌లో టీమ్ ని ఫైనల్‌కు చేర్చిన అయ్యర్‌పై కింగ్స్ ఫ్రాంచైజీ భారీగా ఆశలు పెట్టుకుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 
గత సీజన్‌లో ఆర్సీబీకి తొలి టైటిల్ అందించిన రజత్ పాటిదార్ ఈసారి కూడా జట్టును నడిపించనున్నాడు. విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించనున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్: 
అక్షర్ పటేల్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. గత సీజన్‌లో మంచి ఆరంభం చేసినప్పటికీ, చివర్లో టీమ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 

గుజరాత్ టైటాన్స్: 
శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. రెండోసారి టైటిల్ సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. 

రాజస్థాన్ రాయల్స్: 
రియాన్ పరాగ్ ఈసారి పూర్తి స్థాయి కెప్టెన్‌గా రాజస్థాన్ రాయల్స్ జట్టును నడిపించనున్నాడు. ఇది అతనికి తొలి పూర్తి సీజన్ కెప్టెన్సీ అని చెప్పాలి.