IPL 2026: ఇవేం ఎలివేషన్స్ రా బాబు.. సోషల్ మీడియాలో ఐపీఎల్ జట్ల రచ్చ మాములుగా లేదు!

IPL 2026: ఇవేం ఎలివేషన్స్ రా బాబు.. సోషల్ మీడియాలో ఐపీఎల్ జట్ల రచ్చ మాములుగా లేదు!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ క్యాచ్ రిచ్ లీగ్ స్టార్ట్ కావడానికి మరో వారం రోజుల సమయం ఉంది. అయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ప్లేయర్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఆటగాళ్లకు సంబంధించిన వీడియోలను ఒక జట్టుకు మించిన ప్లానింగ్ తో మరొకరు వైరల్ అవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాస్తా.. ఇండియన్ సోషల్ మీడియా లీగ్ గా మారిపోయేలా కనిపిస్తుంది. 10 జట్లు తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.