IPL 2027: ఐపీఎల్ 2026 వర్స్ట్ పర్ఫార్మెన్స్‌కు చెక్ పెడుతూ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మేనేజ్‌మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో కేవలం 6 మాత్రమే గెలిచి పాయింట్ల టేబుల్‌లో 8వ స్థానానికే పరిమితమైన ఎల్లో ఆర్మీ, రాబోయే ఐపీఎల్ 2027 వేలం వేదికగా భారీ ప్రక్షాళనకు సిద్ధమైంది. నెట్‌వర్క్స్, సోషల్ మీడియాలో మార్మోగుతున్న పక్కా సమాచారం ప్రకారం.. ఫ్రాంచైజీకి భారంగా మారిన ఐదుగురు కీలక ఆటగాళ్లని వేలంలో విడుదల చేసేందుకు కళ్ళు చెదిరే ప్లాన్ రెడీ చేసింది.
కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీకి సెండాఫ్:
ఐపీఎల్ 2027 టోర్నీలో ఎంఎస్ ధోనీ ఆటగాడిగా బరిలోకి దిగుతాడా లేదా అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 45 ఏళ్ల వయస్సులో మోకాలి గాయంతో 2026 సీజన్‌కు పూర్తిగా దూరమైన మహేంధ్రుడు, వచ్చే ఏడాది ప్లేయర్‌గా మైదానంలో కనిపించడం దాదాపు కష్టమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ధోనీ సీఎస్‌కే మెంటార్‌గా కొత్త రోల్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రిలీజ్ లిస్ట్‌లో ధోనీ పేరే ముందు వరుసలో ఉండే ఛాన్స్ ఎక్కువగా వినిపిస్తుంది.
హార్దిక్ కోసం శివమ్ దూబే బలి:
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను దక్కించుకునేందుకు సీఎస్‌కే యాజమాన్యం గట్టి స్కెచ్ వేస్తోంది. ఈ క్రమంలోనే సీఎస్కే తమ హార్డ్ హిట్టర్ శివమ్ దూబేను వదులుకునేందుకు రెడీ అయినట్లు వార్త కథనాలు ట్రెండ్ అవుతున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో కేవలం 270 రన్స్ చేసి, బౌలింగ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో దూబేను రిలీజ్ చేసి లేదా ట్రేడ్ డీల్‌లో భాగంగా ముంబైకి పంపించేందుకు చెన్నై పావులు రచిస్తోంది.
కళ్ళు చెదిరే రూ.14.20 కోట్ల ఫ్లాప్.. ప్రశాంత్ వీర్‌పై వేటు!
భారీ ధరకి జట్టులోకి వచ్చి అట్టర్‌ఫ్లాప్ అయిన రూ.14.20 కోట్ల స్టార్ ప్రశాంత్ వీర్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ వేటు వేయడం దాదాపు ఖాయమైంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం 90 పరుగులు మాత్రమే చేసి, బౌలింగ్‌లోనూ ఓవర్‌కు 12.50 రన్స్ చొప్పున ఘోరంగా విఫలమఐన ఈ యువ ఆల్‌రౌండర్‌ను రిలీజ్ చేసి, అదే బడ్జెట్‌లో సరికొత్త ఇండియన్ స్టార్‌ను వేలంలో దక్కించుకోవాలని ఎల్లో ఆర్మీ యాజమాన్యం చూస్తుంది.
గాయంతో ఖలీల్, డెవాల్డ్ బ్రెవిస్ ఫ్లాప్:
తరచుగా గాయాల బారిన పడుతూ ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలోనే జట్టు నుంచి వెనుతిరిగిన ఇండియన్ పేసర్ ఖలీల్ అహ్మద్‌ను వదిలి పెట్టి క్వాలిటీ స్పీడ్‌స్టర్‌ను రంగంలోకి దించాలని సీఎస్‌కే ప్లాన్ చేస్తుంది. అలాగే సౌతాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయడంలో తీవ్రంగా నిరాశపరిచాడు. ఆడిన 11 మ్యాచ్‌ల్లో 151 పరుగులు మాత్రమే చేసిన అతడిని వేలంలోకి వదిలేసేందుకు ఎల్లో ఆర్మీ సిద్ధమైంది. వచ్చే నవంబర్ లేదా డిసెంబర్‌లో జరగబోయే వేలంలో ఫైర్ బ్రాండ్ ఓవర్‌సీస్ ప్లేయర్‌ను దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ వ్యూహాలు రచిస్తోంది.
